సిరీస్ విజయమే లక్ష్యంగా ఇండోర్ టెస్టులోకి బరిలోకి దిగిన భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు కీలక మార్పులు చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు కూడా ముడిపడి ఉండడంతో ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ను తప్పించింది. అతని స్థానంలో యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్‌గిల్‌కు తుది జట్టులో స్థానం కల్పించింది. అలాగే సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. ఇక ఈ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ముచ్చటగా మూడో టెస్టును గెలిచి ఇక్కడే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది రోహిత్ సేన. అలాగే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడాలని కోరుకుంటోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. పాట్ కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లిపోవడంతో స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ క్యామెరూన్ గ్రీన్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ జట్టులోకి రావడంతో ఆసీస్ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్
ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్ (సి), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్, మాథ్యూ కుహ్నెమాన్
? Team News ?
2️⃣ changes for #TeamIndia as Shubman Gill & Umesh Yadav are named in the team. #INDvAUS | @mastercardindia
Follow the match ▶️ https://t.co/xymbrIdggs
Here’s our Playing XI ? pic.twitter.com/8tAOuzn1Xp
— BCCI (@BCCI) March 1, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..