భారత్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియాకు మరో బ్యాడ్ న్యూస్ అందింది. వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లిన పాట్ కమిన్స్.. ఇప్పుడు భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే సిరీస్ కోసం అతడు భారత్‌కు తిరిగి రావడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో వన్డే సిరీస్‌కూ స్మిత్ సారథిగా ఉంటాడని భావిస్తున్నారు.
పాట్ కమిన్స్ తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన కమిన్స్.. ఆ తర్వాత తల్లి మరణంలో మరలా భారత్‌కు రాలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
Pat Cummins won’t return to India for the ODI leg of the tour #INDvAUS
— cricket.com.au (@cricketcomau) March 14, 2023
పాట్ కమిన్స్ గైర్హాజరీలో మరోసారి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్‌లో సారథ్యం వహించనున్నాడు. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఇండోర్ టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత WTC ఫైనల్‌కు టిక్కెట్‌ను పొందింది. ఇప్పుడు స్మిత్ ముందు వన్డే సిరీస్ గెలవాల్సిన బాధ్యత నెలకొంది.
ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీని చేపట్టాడు. ఇప్పటి వరకు కేవలం 2 వన్డేల్లోనే ఆస్ట్రేలియా కమాండ్‌ని అందుకున్నాడు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 ODIల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 17న ముంబైలో జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ మార్చి 19న జరగనుంది. అదే సమయంలో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 22న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..