తొలుత వెస్టిండీస్‌ను, ఆ తర్వాత దక్షిణాఫ్రికాను స్వదేశంలో ఓడించిన ఆస్ట్రేలియా.. తాజాగా భారత్‌పై కన్నేసింది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్ కోసం వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. అందరి దృష్టి ఈ సిరీస్‌పై ఉంది. ఈమేరకు కమిన్స్ భారత్‌ను ఓడించేందుకు మా ముగ్గురు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత టూర్‌కు రావడం అంటే స్పిన్ బౌలర్ల ఆధిపత్యం చూపించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా ఇందుకు సిద్ధమైంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్‌తో పాటు ఈ సిరీస్‌కు అష్టన్ అగర్, ట్రావిస్ హెడ్‌లను బౌలింగ్ ఆర్మీగా పేర్కొన్నాడు.
సిడ్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు డ్రా అయిన తర్వాత, కమిన్స్ మాట్లాడుతూ, “ఇది పెద్ద సిరీస్. మేం మా అత్యుత్తమ జట్టును రంగంలోకిది దించాలని అనుకుంటున్నాం” అని చెప్పుకొచ్చాడు.
సిడ్నీ టెస్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ అగర్ 22 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. అయినప్పటికీ, కమిన్స్‌కు అతనిపై నమ్మకం ఉంది. అగర్ ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ అని, అతను ఖచ్చితంగా భారత్‌లో ఆడతాడని కమిన్స్ చెప్పుకొచ్చాడు. భారత్ వికెట్ భిన్నంగా ఉంటుంది. అలాంటి బౌలర్ అక్కడ చాలా ఉపయోగకరంగా ఉంటాడు అంటూ తన ప్లాన్స్ ప్రకటించాడు.
వీరితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా ట్రావిస్ హెడ్‌ను కూడా ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ, “ట్రావిస్ భిన్నమైన ఆఫ్ స్పిన్నర్. అతను మాకు చాలా సహాయకారిగా ఉంటాడు. అతని ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నాను. అతను జట్టులో భాగమవుతాడు” అని ఉద్ఘాటించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..