WTC Final 2023: ‘టెస్ట్ ఫైనల్‌’ మ్యాచ్ ఆడబోయే టీమిండియా ప్లేయర్లు వీరే..! జట్టులో తెలుగు ఆటగాడికి నో ఛాన్స్‌..!

|

Jun 04, 2023 | 3:00 PM

WTC Final 2023: వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఓవల్‌ వేదికగా వేదికగా జూన్‌ 7న నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రీ..

WTC Final 2023: ‘టెస్ట్ ఫైనల్‌’ మ్యాచ్ ఆడబోయే టీమిండియా ప్లేయర్లు వీరే..! జట్టులో తెలుగు ఆటగాడికి నో ఛాన్స్‌..!
Aaron Finch’s Team India Playing XI
Follow us on

WTC Final 2023: వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఓవల్‌ వేదికగా వేదికగా జూన్‌ 7న నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రీ, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసీర్ హుసేన్ సహా పలువురు తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్లను ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఫించ్ ఎంపిక చేసుకున్న టీమ్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండనున్నాడు. ఈ టీమ్ అంతా కూడా అందరూ ఊహించినట్లుగానే ఉంది.

అయితే ఫించ్ తెలుగు ప్లేయర్, వికెట్ కీపర్ అయిన కేఎస్ భరత్‌కి కాకుండా ఇషాన్ కిషన్‌కి వికెట్ కీపర్ బాధ్యతలు అప్పగించాడు. ఫించ్ టీమ్‌కి  శుభమాన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఉండగా.. వన్‌డౌన్‌ స్థానాన్ని నయావాల్ చతేశ్వర్ పుజారా దక్కించుకున్నాడు. అలాగే 3, 4 స్థానాల్లో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే.. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. టీమ్ ఆల్‌రౌండర్, స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకి అవకాశం ఇచ్చాడు. ఇంకా ఫించ్ తన టీమ్‌లో ఫాస్ట్ బౌలర్లుగా శార్థూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ,  మహ్మద్‌ సిరాజ్‌ ఉండేలా ఎంపిక చేశాడు. ఫించ్ తన టీమ్‌లో కేఎస్ భరత్‌కి మాత్రమే కాక సీనియర్ స్పీడ్‌స్టర్ ఉమేష్ యాదవ్‌కి కూడా చోటివ్వకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి


ఫించ్‌ ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..