IND vs AUS: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు అట్టర్ ఫ్లాప్.. సెంచరీలతో సత్తా చాటిన ఖవాజా, గ్రీన్..

|

Mar 10, 2023 | 12:57 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు కూడా ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (157 పరుగులు), కెమెరాన్ గ్రీన్ (111 పరుగులు) క్రీజులో ఉన్నారు.

IND vs AUS: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు అట్టర్ ఫ్లాప్.. సెంచరీలతో సత్తా చాటిన ఖవాజా, గ్రీన్..
Ind Vs Aus 4th Test
Follow us on

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు కూడా ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (157 పరుగులు), కెమెరాన్ గ్రీన్ (111 పరుగులు) క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 200ల భాగస్వామ్యం నెలకొంది. వార్తలు రాసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్లకు 374 పరుగులు చేసింది.

జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి వచ్చారు.

రెండో రోజు తొలి సెషన్‌లో బౌలర్లకు వికెట్ నుంచి పెద్దగా సాయం లభించకపోవడంతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం ప్రదర్శించారు. లంచ్ వరకు ఖవాజా, గ్రీన్ కలిసి జట్టు స్కోరును 347/4కు తీసుకెళ్లారు. ఉస్మాన్ ఖవాజా 150 పరుగులు పూర్తి చేయగా, కామెరాన్ గ్రీన్ 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెషన్‌లో 92 పరుగులు చేయగా, భారత్‌కు వికెట్ దక్కలేదు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాకు అదిరే ఆరంభం..

ఆస్ట్రేలియా జట్టుకు తొలిరోజు శుభారంభం లభించింది. తొలి రోజు ఆ జట్టు నాలుగు వికెట్లకు 255 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 104, కెమెరాన్ గ్రీన్ 49 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 38, ట్రావిస్ హెడ్ 32, పీటర్ హ్యాండ్‌కాంబ్ 17, మార్నస్ లబుషెన్ 3 పరుగుల వద్ద ఔటయ్యారు.

భారత్ తరపున మహ్మద్ షమీ అత్యధికంగా 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో 1 వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..