AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 4th T20I: భారత్ – ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌కు కరెంట్ గండం.. మ్యాచ్ జరిగేనా?

మరోవైపు ఇదే స్టేడియంలో 2018 నుంచి మూడు అంతర్జాతీయ మ్యాచులు జరిగాయి. 2018లో స్థానిక అథ్లెట్స్ హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్న క్రమంలో స్టేడియంలో పవర్ కట్ మధ్యలోనే అయిపోయింది. అప్పుడే ఈ స్టేడియానికి 3.16 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. స్టేడియం నిర్మాణం జరిగిన తర్వాత మెయింటెనెన్స్ మొత్తం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది.

IND vs AUS 4th T20I: భారత్ - ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌కు కరెంట్ గండం.. మ్యాచ్ జరిగేనా?
Shaheed Veer Narayan Singh
Lakshmi Praneetha Perugu
| Edited By: Venkata Chari|

Updated on: Dec 01, 2023 | 3:13 PM

Share

India vs Australia, 4th T20I: భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్ రాయపూర్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లను టీమ్ ఇండియా విజయం సాధించగా.. మూడో టీ20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక నేడు 4వ టీ20 మ్యాచ్ చతిస్గడ్‌లోని రాయపూర్‌లో జరగనుంది. రాయపూర్ లోని షాహిద్ వీరనారాయణ స్టేడియంలో సాయంత్రం ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ పై ఒక సందిగ్ధత నెలకొని ఉంది. ఈ స్టేడియంకి కట్టాల్సిన కరెంట్ బిల్లు గత 15 సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉంది. దీంతో ఈ మ్యాచ్ కి ఎలాంటి అంతరాయం కలుగుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి స్టేడియంకు చెందిన కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉండటంతో స్టేడియంకు పవర్ కట్ చేశారు అధికారులు.

2009 నుంచి స్టేడియంకు సంబంధించిన కరెంటు బిల్లు అక్షరాల 3.16 కోట్ల రూపాయలు ఉంది. ఈ బిల్లును చెల్లించడంలో సంబంధిత అధికారులు విఫలం కావడంతో స్టేడియంకు పవర్ కట్ చేసేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో కరెంటు సప్లై నిలిచిపోయింది. ఎప్పుడైనా మ్యాచులు స్టేడియంలో జరిగితే టెంపరరీగా జనరేటర్‌లను ఏర్పాటు చేస్తూ వచ్చింది చతిస్గడ్ క్రికెట్ అసోసియేషన్. కానీ, ఈ జనరేటర్లు కేవలం వీఐపీ బాక్సులతోపాటు గ్యాలరీ వరకు మాత్రమే ఈ సప్లై వస్తుంది. స్టేడియంలోని ఫ్లడ్లైట్లు వెలగాలంటే అదనపు జనరేటర్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. రాయపూర్ పోలీస్ అధికారి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం స్టేడియం సెక్రెటరీ ఇప్పటికే వచ్చే పవర్ కెపాసిటీని పెంచాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతానికి స్టేడియంలో ఉన్న జనరేటర్ల కెపాసిటీ కేవలం 200కేవీ మాత్రమే ఉంది. దీనిని ఒక 1 వెయ్యి kv కు పెంచుకునేందుకు అసోసియేషన్ సెక్రెటరీ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు.

మరోవైపు ఇదే స్టేడియంలో 2018 నుంచి మూడు అంతర్జాతీయ మ్యాచులు జరిగాయి. 2018లో స్థానిక అథ్లెట్స్ హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్న క్రమంలో స్టేడియంలో పవర్ కట్ మధ్యలోనే అయిపోయింది. అప్పుడే ఈ స్టేడియానికి 3.16 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. స్టేడియం నిర్మాణం జరిగిన తర్వాత మెయింటెనెన్స్ మొత్తం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దానికి సంబంధించిన ఖర్చులు మొత్తాన్ని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే, కరెంట్ బిల్లు చెల్లించే విషయంపై ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గత 15 సంవత్సరాల నుంచి పవర్ బిల్ పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు శాఖలకు పలుమార్లు విద్యుత్ శాఖ నుంచి నోటీసులు జారీ చేసిన ఎలాంటి క్లియరెన్స్ చేయలేదు. అంతర్జాతీయ మ్యాచుల కోసం ఆల్టర్నేటివ్గా అదనపు జనరేటర్ లను ఉపయోగించి ఏర్పాట్లు చేసుకుంటామని చతిస్గడ్ క్రికెట్ అసోసియేషన్ తెలుపుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..