Jasprit Bumrah: కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియాలో బుమ్రా తగ్గేదలే..

|

Dec 18, 2024 | 9:26 AM

Jasprit Bumrah breaks Kapil Dev Record: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ భారీ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో తిరుగులేని భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేయడం విశేసం. ఆసీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

Jasprit Bumrah: కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియాలో బుమ్రా తగ్గేదలే..
Jasprit Bumrah Tests
Follow us on

Jasprit Bumrah breaks Kapil Dev Record: జస్ప్రీత్ బుమ్రా బుధవారం బ్రిస్బేన్‌లో జరుగుతోన్న మూడో టెస్టులో ఐదో రోజు ఆస్ట్రేలియాలో కపిల్ దేవ్‌ను అధిగమించాడు. దీంతో ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల టీమిండియా పేసర్ ఇప్పుడు 52 వికెట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కపిల్ 11 టెస్టుల్లో 51 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నేలను పెవిలియన్ చేర్చి ఆధిక్యంలోకి వెళ్లాడు.

ఆస్ట్రేలియాలో భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు..

52 జస్ప్రీత్ బుమ్రా (సగటు 17.21)

51 కపిల్ దేవ్ (24.58)

ఇవి కూడా చదవండి

49 అనిల్ కుంబ్లే (37.73)

40 ఆర్ అశ్విన్ (42.42)

35 బిషన్ బేడీ (27.51)

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 260 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం రెండో సెషన్ ఆట కొనసాగుతుండగా ఆస్ట్రేలియా 4 వికెట్లకు 28 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 211 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.  మార్ష్ 2, నాథన్ మెక్ స్వీనీ 4 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. జస్‌ప్రీత్ బుమ్రా ఉస్మాన్ ఖవాజా (8 పరుగులు), మార్నస్ లాబుషాగ్నే (1 పరుగు)లను పెవిలియన్‌కు పంపారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..