IND vs AUS 3rd Test: అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన నాథన్ లియాన్.. ఆ లిస్ట్‌లో మొదటి స్థానానికి కూడా..

|

Mar 03, 2023 | 7:45 AM

రెండు ఇన్నింగ్స్‌లలోనూ లియాన్ ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. అయితే రెండు మ్యాచ్‌లు ఓడిన..

IND vs AUS 3rd Test: అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన నాథన్ లియాన్.. ఆ లిస్ట్‌లో మొదటి స్థానానికి కూడా..
Nathan Lyon
Follow us on

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్వల్ప పరుగులే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌ ముగిసే సరికి ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్నే నిర్దేశించింది. ఇక ప్రత్యర్థి జట్టులోని వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ 8 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. ఫలితంగా టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ లియాన్ ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. అయితే రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత ఆసీస్ స్పిన్నర్ లియాన్ ఈ టెస్ట్‌లో భారత్‌ను ఓటమి దిశగా నెట్టడమే కాకుండా.. ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. దీని కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.

భాతర్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 111 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉండేవాడు. అయితే తాజాగా నాథన్ లియాన్ ఈ రోజు మ్యాచ్‌లో 57వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వికెట్ తీయడంతో 112వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా కుంబ్లే 111 వికెట్లతో రెండో స్థానంలో 112వ వికెట్లతో లియాన్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత అశ్విన్ 106 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు..

  1. నాథన్ లియాన్- 112 వికెట్లు
  2. అనిల్ కుంబ్లే- 111 వికెట్లు
  3. రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు
  4. హర్భజన్ సింగ్- 95 వికెట్లు
  5. రవీంద్ర జడేజా- 84 వికెట్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..