IND vs AUS: సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన అభిమాని.. షమీ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

ఇటీవల క్రికెట్‌ మైదానాల్లోకి అభిమానులు రావడం సర్వసాధారణమైపోయింది. తమ అభిమాన క్రికెటర్లను కలిసేందుకు సెక్యూరిటీ కళ్లుగప్పి మరీ గ్రౌండ్‌లోకి చొరబడుతున్నారు. అభిమానం ఉంటే పర్లేదు కానీ.. ఒక్కోసారి ఇవి క్రికెటర్ల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది

IND vs AUS: సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన అభిమాని.. షమీ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే
Mohammed Shami

Updated on: Feb 17, 2023 | 3:50 PM

ఇటీవల క్రికెట్‌ మైదానాల్లోకి అభిమానులు రావడం సర్వసాధారణమైపోయింది. తమ అభిమాన క్రికెటర్లను కలిసేందుకు సెక్యూరిటీ కళ్లుగప్పి మరీ గ్రౌండ్‌లోకి చొరబడుతున్నారు. అభిమానం ఉంటే పర్లేదు కానీ.. ఒక్కోసారి ఇవి క్రికెటర్ల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని క్రికెట్‌ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఎన్ని పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. బారీ కేడ్లు దూకి మరీ గ్రౌండ్ లోకి పరిగెత్తాడు. ఇంతలోనే దీనిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని పిచ్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలోనే అక్కడకు వచ్చాడు టీమిండియా స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ. దయచేసి కుర్రాడిని అలా ఈడ్చుకెళ్లవద్దంటూ సెక్యూరిటీకి నచ్చజెప్పాడు. అంతేకాదు ఆ కుర్రాడితో సావధానంగా మాట్లాడి బయటకు పంపించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. షమీ చేసిన మంచి పనికి ఫ్యాన్స్‌, నెటిజన్లందరూ ఫిదా అవుతున్నారు. అయితే ఆ కుర్రాడి ఏ ఆటగాడి కోసం వచ్చాడో మాత్రం తెలియరాలేదు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. కడపటి వార్తలందే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ లో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 81 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ (60 నాటౌట్‌), ప్యాట్‌ కమిన్స్‌ రాణించారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌, జడేజా తలా మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..