IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు ఇప్పుడు వన్డే సిరీస్‌లో ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ల విషయంలో ఇరు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఈ మేరుక భారత జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు కంగారూ జట్టు కమాండ్ స్టీవ్ స్మిత్ చేతిలోకి అందింది.
భారత వన్డే జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 11 టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరోవైపు, స్టీవ్ స్మిత్ ఐదేళ్ల తర్వాత వన్డేలకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. అతను 2014 నుంచి 2018 వరకు ఆస్ట్రేలియాకు రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 17 మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం Disney + Hotstar యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
భారత జట్టు: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ షమీ సుందర్, మహ్మద్ షమీ సుందర్ , శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ సియోనిస్, జోస్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, అష్టన్ అగర్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, సీన్ అబాట్, మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..