AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : తొలి వన్డేలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. రోహిత్-కోహ్లీ ఎంట్రీ.. వీళ్లు బెంచ్‌కే పరిమితం

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పర్త్‌లో జరగనుంది. దాదాపు 9 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. వీరు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేరు. టెస్ట్ తర్వాత వన్డేలకు కూడా శుభ్‌మన్ గిల్‌‎ను కెప్టెన్‌గా నియమించారు.

IND vs AUS : తొలి వన్డేలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. రోహిత్-కోహ్లీ ఎంట్రీ.. వీళ్లు బెంచ్‌కే పరిమితం
Ind Vs Aus
Rakesh
|

Updated on: Oct 16, 2025 | 10:16 AM

Share

IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పర్త్‌లో జరగనుంది. దాదాపు 9 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. వీరు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేరు. టెస్ట్ తర్వాత వన్డేలకు కూడా శుభ్‌మన్ గిల్‌‎ను కెప్టెన్‌గా నియమించారు. గిల్ సారథ్యంలో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ ఎలెవన్ దాదాపు ఖరారైంది. పెర్త్‎లో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరు బెంచ్‌కే పరిమితం అవుతారో చూద్దాం.

తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీని కారణంగా యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌కు తొలి మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు. రోహిత్ తన చివరి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడి, 76 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. నంబర్ 3 స్థానంలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆడటం పక్కా. కోహ్లీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇదే. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై కోహ్లీ బ్యాట్ పరుగులు చేసే అవకాశం ఉంది. కోహ్లీ వన్డే రికార్డు విషయానికి వస్తే, 302 మ్యాచ్‌లలో 14,181 పరుగులు చేశాడు. మరో 54 పరుగులు చేస్తే, వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార్ సంగక్కరను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటాడు.

నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశం ఉంది, ఆయన మిడిల్ ఆర్డర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. అయ్యర్ 70 వన్డేలలో 2,845 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది, ఆయన ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. దీంతో ధ్రువ్ జురెల్‌ను తొలి వన్డేకు బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆరో స్థానంలో ఆడవచ్చు. అతను డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడగలడు, అంతేకాక స్పిన్, పేస్ బౌలింగ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మీడియం పేస్ బార్ట్-టైమ్ బౌలింగ్ కూడా చేయగలడు.

స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్షర్ దూకుడైన బ్యాటింగ్ కూడా చేయగలడు. కుల్దీప్ యాదవ్ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాబట్టి వాషింగ్టన్ సుందర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. పేస్ బౌలర్లుగా మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడవచ్చు. పర్త్ పిచ్‌పై సిరాజ్ ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంది. హర్షిత్ రాణాకు తొలి వన్డేలో చోటు దక్కకపోవచ్చు.

తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..