భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుని ఆఫ్ఘనిస్థాన్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ విడుదలైన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుత సెంచరీ సాధించిన సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడమే అభిమానుల ఆగ్రహానికి కారణం. అఫ్గానిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కచ్చితంగా సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తాడని అభిమానులు అంచనా వేశారు. అయితే అలాంటిదేం జరగలేదు. ప్లేయింగ్ 11లో సంజూ పేరు చూడని అభిమానులు సెలక్షన్ బోర్డుపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో చెలరేగగా.. 114 బంతులు ఎదుర్కొన్న సంజూ 108 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఈ సిరీస్‌లో సంజుకు అవకాశం దక్కుతుందని చెప్పుకొచ్చారు. అయితే సంజుకు మళ్లీ అన్యాయం జరిగిందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో శామ్సన్‌కు బదులుగా జితేష్ శర్మ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. జితేష్‌తో పాటు తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకున్నారు. అయితే గత మ్యాచ్‌ల్లో అతని పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తిలక్‌కు తుది జట్టులో స్థానం కల్పించడం అభిమానులకు మరింత కోపం తెప్పించింది. సంజూ తన చివరి టీ20 మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే అతడికి జట్టులో చోటు దక్కలేదు. గతంలో సంజు విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ కారణంగానే టీమిండియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్.
Feeling really sad right now about Sanju Samson in #INDvsAFG. 💔🥹💔#SanjuSamson #sanju #CricketTwitter #TeamIndia pic.twitter.com/kiWcn2ySz4
— Sahib Singh (@singh28915) January 11, 2024
Innings Break!
Afghanistan post 158/5 on the board.
2⃣ wickets each for @akshar2026 & Mukesh Kumar
1⃣ wicket for Shivam DubeOver to our batters now 👍 👍
Scorecard ▶️ https://t.co/BkCq71Zm6G#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/E9Nnsn6Xx4
— BCCI (@BCCI) January 11, 2024
I. C. Y. M. I!
Double success with the ball for Mukesh Kumar 😎
Recap his two strikes in an over ⚡️⚡️#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/oLQCi25mma
— BCCI (@BCCI) January 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..