
IND vs AFG 3rd ODI : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య చెన్నై వేదికగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మొదట ఫీల్డింగ్‌కు దిగనుంది. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, మొదట భారీ స్కోరు బోర్డుపై ఉంచి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాలని అఫ్గాన్ జట్టు భావిస్తోంది. ఈ చివరి వన్డే మ్యాచ్ కోసం భారత మేనేజ్‌మెంట్ జట్టులో మూడు పెద్ద మార్పులు చేసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, లీడింగ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌లకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. వారి స్థానంలో యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణలను తుది జట్టులోకి తీసుకువచ్చారు. సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అఫ్గాన్ జట్టులో నాలుగు మార్పులు
మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చేందుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగు కీలక మార్పులు చేసింది. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రెహమాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను తుది జట్టులోకి చేర్చింది. ఈ మార్పుల ద్వారా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను మరింత బలోపేతం చేసినట్లు అఫ్గాన్ కెప్టెన్ టాస్ సమయంలో వెల్లడించాడు. రెండు జట్లు కలిపి మొత్తం 7 మార్పులు చేయడంతో ఈ మ్యాచ్ సరికొత్తగా సాగనుంది.
హర్షిత్ రాణాకు దక్కని అవకాశం
ఈ మ్యాచ్‌కు ముందు యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా భారత వన్డే జట్టుతో చేరినప్పటికీ, అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2026, టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలకు దూరమైన హర్షిత్, ఇటీవల మళ్లీ భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. అయితే మేనేజ్‌మెంట్ అతనిని వన్డేల్లో ఆడించడం కంటే, రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోంది. అందువల్లే అతనికి ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండా బెంచ్‌కే పరిమితం చేశారు.
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్
భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.
అఫ్గానిస్తాన్ జట్టు: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), దర్విష్ రసూలి, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ గజన్ఫర్, జియా ఉర్ రెహమాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..