ACC Emerging Teams Asia Cup 2023: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌తో సహా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడో మ్యాచ్‌ల్లోనూ కనీసం 8 వికెట్ల తేడాతో విజయాలు సాధించారు. ముఖ్యంగా బుధవారం పాకిస్థాన్‌తో తలపడి.. చిరకాల ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో భారత్ తరఫున సాయి సుదర్శన్ బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయమైన సెంచరీ(104).. హంగార్గేకర్ 5, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసుకున్నారు.
శ్రీలంక కొలొంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 205 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ తరఫున కాసిమ్ అక్రమ్ 48, సహిబ్జాదా ఫర్హాన్ 35 మినహా మిగిలినవారెవరూ 30 పరుగులను దాటలేకపోయారు. దీంతో 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా యువ కెరటాలు 2 వికెట్లు కొల్పోయి 36.4 ఓవర్లలోనే పని పూర్తి చేశాయి. ఈ క్రమంలో టీమ్ ఓపెనర్ సాయి సుదర్శన్ 104 పరుగులతో అజేయమైన సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికిన్ జోస్ 53 పరుగులతో అర్థసెంచరీ చేసుకుని ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాట్‌తో క్రీజులోకి వచ్చి సాయి సుదర్శన్‌తో జత కలిసిన కెప్టెన్ యష్ దుల్ అజేయంగా 21 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఖాతాలో వరుసగా మూడో విజయం చేరింది.
🔥🇮🇳 VICTORY IS OURS! India A defeats Pakistan A in style, courtesy of Sai Sudharsan’s century.
📷 BCCI • #ACCMensEmergingTeamsAsiaCup #ACC #INDAvPAKA #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/CozT8OjEmH
— The Bharat Army (@thebharatarmy) July 19, 2023
కాగా, ఈ మ్యాచ్ గురించి తప్పక చెప్పుకోవాల్సి విషయం ఏమిటంటే.. 36వ ఓవర్ ముగిసే సరికి సాయి సుదర్శన్ స్కోర్ 88 పరుగులు. అలాగే టీమ్ విజయం కోసం కేవలం 12 పరుగులే అవసరం. అయితే 37వ ఓవర్ మొదటి బంతికి క్రీజులోనే ఉన్న సాయి సుదర్శన్ బాల్‌ని బౌండరీకి పంపాడు. రెండో బంతి డాట్ అయినా.. 3, 4 బంతులను సిక్సర్‌గా మలిచి తన సెంచరీని పూర్తి చేసుకోవడంతో పాటు టీమిండియాను ప్రత్యర్థి పాక్‌పై గెలిపించాడు. కాగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ మ్యాచ్‌కి ముందు యూఏఈ ఎ తో తలపడిన భారత్ అందులో 8 వికెట్ల తేడాతో.. అలాగే నేపాల్ ఎ తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల వ్యత్యాసంతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..