Video: అంత పొగరైతే ఎట్లా బ్రో.. పాండ్యాను తిట్టిపోస్తున్న కోహ్లీ ఫ్యాన్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

|

Mar 18, 2023 | 1:14 PM

Hardik Pandya-Virat Kohli: హార్దిక్ పాండ్యా టీమిండియా వన్డే కెప్టెన్సీ అరంగేట్రం మ్యాచ్‌ని విజయంతో ఘనంగా ప్రారంభించాడు. శుక్రవారం (మార్చి 17) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డే జరిగింది.

Video: అంత పొగరైతే ఎట్లా బ్రో.. పాండ్యాను తిట్టిపోస్తున్న కోహ్లీ ఫ్యాన్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Hardik Virat Viral
Follow us on

హార్దిక్ పాండ్యా టీమిండియా వన్డే కెప్టెన్సీ అరంగేట్రం మ్యాచ్‌ని విజయంతో ఘనంగా ప్రారంభించాడు. శుక్రవారం (మార్చి 17) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డే జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 29 ఏళ్ల హార్దిక్.. తన కెప్టెన్సీతోనే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. కాగా, గతంలో అనేక సందర్భాల్లో T20I లలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం 50 ఓవర్ల మ్యాచ్‌లో రోహిత్ గైర్హాజరీతో కెప్టెన్‌గా అవకాశం లభించింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో హార్దిక్ పూర్తి స్థాయిలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇక విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మొదటిసారి హార్దిక్ నాయకత్వంలో ఆడారు. సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్‌లోని ఓ సందర్భంలో విరాట్, హార్దిక్, కుల్దీప్ సంభాషిస్తోన్న ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కారణం, విరాట్ ఏదో చెబుతున్నా.. పూర్తిగా వినకుండానే హార్దిక్ వెళ్లిపోయాడు. కాగా, ఈ క్లిప్‌లో ఏం మాట్లాడరనేది మాత్రం బయటకు రాలేదు. అయితే, అంతా హార్దిక్ రియాక్షన్ చూసి షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ ఇస్తున్న సలహాలు పట్టించుకోకుండా అలా వెళ్లిపోవడం ఏం బాగోలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అప్పుతే ఇంత పొగరు పనికిరాదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ సీనియర్ ప్లేయర్‌కు గౌరవం ఇవ్వకుండా అలా వెళ్లిపోవడం పద్ధతిగా లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం (మార్చి 19) విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..