సాధారణంగా ఏదైనా క్రికెట్ జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి ‘ఏ’ టీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. కానీ ఇక్కడ టీం ఇండియాకు అనూహ్యంగా ఇండియా-ఏ టీంతో మ్యాచ్ ఆడాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్ పర్యటనలో భారత్, భారత్-ఏ నాలుగు రోజుల సన్నాహక టెస్టులో తలపడనున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగే ఈ పోరుకు నార్తాంప్టన్‌షైర్ కౌంటీ మైదానం వేదిక కానుంది. తేదీలు మాత్రం ఇంకా ఖరారుకాలేదు.
ఐదు టెస్టుల సిరీసు కోసం టీమ్‌ఇండియా ఆగస్టు, సెప్టెంబర్లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. తొలిటెస్టు ఆగస్టు 4న నాటింగ్‌హామ్‌లో మొదలవుతుంది. ‘భారత్, భారత్-ఏకు మేం స్వాగతం పలుకుతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లు ఈ వేసవిలో కౌంటీ గ్రౌండ్‌లో తలపడనున్నారు అని నార్తాంప్టన్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తెలిపింది. ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా నాలుగు రోజుల సన్నాహక టెస్టులో భారత్-ఏతో తలపడనుంది. జులై 28న రెండో వార్మప్ మ్యాచ్ కోసం భారత బృందం అక్కడి నుంచి లీసెస్టర్‌షైర్‌కు చేరుకుంటుంది అని క్లబ్ వెల్లడించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. ఏడాదంతా తీరిక లేని క్రికెట్.. ఫ్యాన్స్‌కు పండగే పండగ