
Test Cricket Records
Highest Margin Win In Test Cricket: రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది . తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మొత్తంగా 557 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 434 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రత్యేక రికార్డును లిఖించింది.
అంటే టెస్టు క్రికెట్‌లో భారత జట్టు సాధించిన గొప్ప విజయం ఇదే. దీనికి ముందు, 2021లో న్యూజిలాండ్‌పై టీమిండియా 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు 434 పరుగుల భారీ విజయంతో టీమిండియా పాత రికార్డును చెరిపేసింది. అయితే టెస్టు క్రికెట్‌లో ఇదేం గొప్ప విజయం కాదనే సంగతి మీకు తెలుసా? అసలు టెస్ట్ క్రికెట్‌లో భారీ విజయం ఎవరు, ఎప్పుడు సాధించారో ఇప్పుడు చూద్దాం..
భారీ విజయాలు హిస్టరీ..
- ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
- 1928లో ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఈ రికార్డును లిఖించింది.
- ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 521 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 122 పరుగులకే ఆలౌటైంది.
- దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
- తొలి ఇన్నింగ్స్‌లో 399 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో 742 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 66 పరుగులకే ఆలౌటైంది. దీని ద్వారా ఇంగ్లండ్ జట్టు 675 పరుగుల తేడాతో విజయం సాధించి కొత్త చరిత్రను లిఖించింది.
- 96 ఏళ్ల క్రితం నమోదైన ఈ 675 పరుగుల ప్రపంచ రికార్డు అలాగే మిగిలిపోయింది.
టెస్టు క్రికెట్‌లో అతిపెద్ద విజయాలు:
- ఇంగ్లండ్: ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో ఘన విజయం
- ఆస్ట్రేలియా: ఇంగ్లండ్‌పై 562 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
- బంగ్లాదేశ్: ఆఫ్ఘనిస్థాన్‌పై 546 పరుగుల విజయం
- ఆస్ట్రేలియా: దక్షిణాఫ్రికాపై 530 పరుగుల విజయం
- దక్షిణాఫ్రికా: ఆస్ట్రేలియాపై 492 పరుగుల భారీ విజయం
- ఆస్ట్రేలియా: పాకిస్థాన్‌పై 491 పరుగుల తేడాతో భారీ విజయం
- శ్రీలంక: బంగ్లాదేశ్‌పై 465 పరుగుల తేడాతో విజయం.
- ఇంగ్లండ్‌పై భారత్ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..