AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 19 బంతుల్లో ఫిఫ్టీ.. 46 బంతుల్లో సెంచరీ.. 10 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత..

ILT20: ఈ 28 ఏళ్ల ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో భయాందోళనలు సృష్టిస్తున్న ఇతర ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి రాగానే విధ్వంసం ప్రారంభించాడు.

T20 Cricket: వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 19 బంతుల్లో ఫిఫ్టీ.. 46 బంతుల్లో సెంచరీ.. 10 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత..
Ilt20 Tom Kohler Cadmore Ce
Venkata Chari
|

Updated on: Jan 22, 2023 | 7:30 AM

Share

ఒకవైపు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ విల్ జాక్వెస్, జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ కనిపిస్తుండగా, యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ తమ సత్తా చాటుతున్నారు. టోర్నీలో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా రాని చోట, ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు అద్భుతమైన సెంచరీలు నమోదయ్యాయి. శుక్రవారం, జనవరి 20, డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ టోర్నమెంట్‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు మరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామ్ కోలార్ కాడ్మోర్ కూడా మెరుపు సెంచరీతో చెలరేగాడు.

జనవరి 21, శనివారం, దుబాయ్‌లో, ఓపెనర్ టామ్ కోలార్ కాడ్మోర్ బ్యాట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో షార్జా వారియర్స్ దుబాయ్ క్యాపిటల్స్ స్కోర్‌ను బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనికి సమాధానంగా, కాడ్మోర్ దుబాయ్ బౌలర్లను చిత్తు చేయడంతో షార్జా 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ..

ఈ 28 ఏళ్ల ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో భయాందోళనలు సృష్టిస్తున్న ఇతర ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి రాగానే విధ్వంసం ప్రారంభించాడు. కాడ్మోర్ కేవలం 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా 46 బంతుల్లోనే అద్భుత సెంచరీ బాదేశాడు.

47 బంతుల్లో 106 పరుగులు..

కాడ్మోర్ కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కాడ్మోర్ 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్‌లోనే కాడ్మోర్‌కి ఇదే తొలి సెంచరీ.

జో రూట్ కూడా..

అంతకుముందు దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఇంగ్లాండ్ వెటరన్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కూడా పరుగులు చేశాడు. రూట్ 54 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేయగా, జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల ఆధారంగా దుబాయ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..