ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపే టీమిండియా ఆటగాళ్లు వీరే.. 2011 మ్యాజిక్ రిపీట్..
వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. 2023 ప్రపంచ కప్‌లో ఆడనున్న 7గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 ఈసారి భారత్‌లో జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతకుముందు, 2011 ప్రపంచకప్‌ను భారత గడ్డపై నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటుందన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. 2023 ప్రపంచ కప్‌లో ఆడబోయే ఓ 7గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోహిత్ శర్మ- వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జట్టు కెప్టెన్సీకి సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గత కొంత కాలంగా రోహిత్ శర్మ ఫాం మిశ్రమగా కనిపిస్తోంది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్‌లో 3 అర్ధ సెంచరీలు వచ్చాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 83 పరుగులు.
విరాట్ కోహ్లీ- మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచాన్ని ఆడటం ఖాయం. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతను తన చివరి వన్డే ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు సాధించాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 166* పరుగులు.
శుభ్‌మాన్ గిల్- టీమ్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో అతను అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు.
హార్దిక్ పాండ్యా- భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలంగా అద్భుతమైన రిథమ్‌లో కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హార్దిక్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో, అతను బ్యాటింగ్ చేస్తూ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లో గత 10 వన్డేల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ సిరాజ్- భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2022 నుంచి వన్డేల్లో అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు. ఈసారి అతను భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఆడనున్నాడు. సిరాజ్ తన చివరి 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు.
కేఎల్ రాహుల్- జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 2023 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాలో కనిపించనున్నాడు. రాహుల్ గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో రాహుల్ బ్యాట్‌తో మొత్తం 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓసారి అతను 49 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
యుజ్వేంద్ర చాహల్- భారత జట్టులో మ్యాజిక్ స్పిన్నర్‌గా పేరుగాంచిన యుజ్వేంద్ర చాహల్.. ఎల్లప్పుడూ జట్టు ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. చాహల్ ఎప్పుడూ జట్టు తరపున వికెట్లు తీస్తుంటాడు. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..