ఒకే ఓవర్లో 6 సిక్సర్లు. గతంలో క్రికెట్‌లో ఇటువంటి రికార్డులు చాలా అరుదుగా జరిగేవి. కానీ ఇప్పుడు అంతటా బ్యాటర్లదే రాజ్యం. ఏ మ్యాచ్ చూసినా ఫోర్లు, సిక్సర్ల వర్షమే. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. తాజాగా పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ కూడా ఈ జాబితాలో చేరాడు. తన దేశానికి చెందిన ఫాస్ట్ బౌలర్, ప్రస్తుతం పంజాబ్ ప్రావీన్స్ తాత్కాలిక క్రీడా మంత్రి వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 20 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్ 50 బంతుల్లో 94 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) చరిత్రలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అందులోనూ 6 బంతుల్లోనే 6 సిక్సర్లతో ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నాడు. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో ఇఫ్తికార్ బ్యాటింగ్‌తో తొలుత ఆడిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్ తన జట్టు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి 42 బంతుల్లో 50 పరుగులు మాత్రమే చేసిన ఇఫ్తికార్ అహ్మద్ తర్వాతి 8 బంతుల్లోనే మరో 44 పరుగులు జోడించడం విశేషం.
అంతకుముందు ఇఫ్తికార్ అహ్మద్‌తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఖుష్దిల్ షా వికెట్‌ను వహాబ్ రియాజ్ పడగొట్టాడు. 36 పరుగుల వద్ద ఖుష్దిల్ షా ఔటయ్యాడు. అయితే అవతలి ఎండ్ నుంచి ఇఫ్తికర్ అహ్మద్ దూకుడు కొనసాగించాడు. వాహబ్ రియాజ్ వేసిన ఒక్క ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. కాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ అదరగొట్టాడు ఇఫ్తికర్. మొత్తం 10 మ్యాచ్‌లలో 69.40 సగటు,161.39 స్ట్రైక్-రేట్‌తో 347 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 204 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇఫ్తికార్ ఒక సెంచరీ, 25 అర్ధ సెంచరీల సహాయంతో 3956 పరుగులు చేశాడు.
6⃣ 6⃣ 6⃣ 6⃣ 6⃣ 6⃣ ?
Iftikhar goes big in the final over of the innings! ?
Watch Live ➡️ https://t.co/xOrGZzkfvl pic.twitter.com/CDSMFoayoZ
— Pakistan Cricket (@TheRealPCB) February 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..