Kapil Dev: వచ్చే నెలలో టీమిండియా ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే, న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోల్పోవడంతో.. బ్యాటింగ్ ఆర్డర్ తోపాటు, ఆటగాళ్లపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు కొంతమంది ఆటగాళ్లను కొత్తగా టెస్టు టీంలోకి చేర్చనున్నారనే వార్తలపై మాజీలు ఫైర్ అవుతున్నారు. తాజాగా కపిల్ దేవ్ ఇదే అంశంపై మాట్లాడుతూ, పృథ్వీషా ను కోరినట్లైతే.. ఇప్పటికే టీంతో ఉన్న ఎక్స్ ట్రా ప్లేయర్లను అవమానించినట్లేనని ఆయన అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో పృథ్వీషాను ఇంగ్లాండ్ టూర్ కి పంపించాలని టీం బీసీసీఐ ని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ టీమిండియా నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘కొత్తగా టీంలోకి కొత్తవారిని పంపాల్సినం అవసరం లేదు. సెలెక్టర్లు ఈ విషయంలో బాధ్యతగా నడుచుకోవాలి. ఇప్పటికే ఓ జట్టును ఎంపిక చేసి, ఇంగ్లండ్ పంపించారు. అయితే, ఆ సమయంలో కెప్టెన్, కోచ్‌లను కచ్చితంగా సంప్రదిస్తారు. శుభ్ మన్ గిల్ గాయంతో ఆడకుంటే, ఓపెనింగ్ చేసేందుకు మరో ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ టీమిండియాతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు కొత్తగా మరో ఆటగాడు అవసరం లేదని నా అభిప్రాయం. ఇలా చేస్తే.. ఇప్పటికే ఎంపిక చేసిన వారిని అవమానించినట్లేనని’ మాజీ కెప్టెన్ వెల్లడించారు.
మరోవైపు టీమిండియా రెండవ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ జట్టుతోనే పృథ్వీషా వెళ్లాడు. ఈనెల 13 నుంచి శ్రీలంక తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరనుంది. ఈ టూర్ కి టీమిండియా కెప్టెన్ గా శిఖర్‌ధావన్ వ్యవహరించనున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ గా భువీ, కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. గతేడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో పృథ్వీషా విఫలమయ్యాడు. దీంతో టీమిండియా అతనిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఈ టైంలో దేశవాళీ క్రికెట్‌లో వరుస సెంచరీలతో రాణించి, విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు సాధించి, శ్రీలకం టూర్ కి ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లోనూ పృథ్వీ రాణించాడు.
Also Read:
IND vs ENG: టీమిండియా కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుంది: ఇయాన్ చాపెల్
Hyderabad Cricket Association: హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు ఎదురుదెబ్బ..!
Mithali Raj: మిథాలీ రాజ్ తరువాతే ధోనీ, విరాట్ కోహ్లీ.. ఏ రికార్డులోనో తెలుసా..?