Team India: ఫైనల్లో గెలిస్తే, భారత జట్టుకు అందే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఒక్కో ఆటగాడికి అందే మొత్తం ఇదే?

Team India Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: ఫైనల్లో గెలిస్తే, భారత జట్టుకు అందే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఒక్కో ఆటగాడికి అందే మొత్తం ఇదే?
Team India

Updated on: Mar 09, 2025 | 4:43 PM

Team India Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ జరుగుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడుతున్నాయి. ముఖ్యంగా, న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మ్యాచ్ ఊపందుకుంటున్న కొద్దీ భారత జట్టు ఆధిపత్యం పెరుగుతోంది. దీంతో టైటిల్ గెలచుకునేందుకు మరితం చేరువైందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే, టైటిల్ గెలుచుకున్న జట్టుకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవాలని కూడా అభిమానులు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రైజ్ మనీ ఎంత?

ఈ టోర్నమెంట్ కోసం బహుమతి మొత్తాన్ని $6 మిలియన్లు లేదా రూ. 60 కోట్లుగా నిర్ణయించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, టైటిల్ గెలిచిన జట్టుతోపాటు, ఓడిన జట్టు కూడా డబ్బును పొందుతుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో వేర్వేరు స్థానాల్లో నిలిచిన జట్లకు ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

విజేత జట్టుకు ప్రైజ్ మనీ – రూ. 19.49 కోట్లు

ఇవి కూడా చదవండి

రన్నరప్ జట్టుకు ప్రైజ్ మనీ – రూ. 9.74 కోట్లు

సెమీ-ఫైనలిస్టులకు ప్రైజ్ మనీ – రూ. 4.87 కోట్లు

5వ, 6వ స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ – రూ. 3.04 కోట్లు

7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ – రూ. 1.21 కోట్లు

గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్‌కు ప్రైజ్ మనీ – రూ. 29.5 లక్షలు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని భారతదేశం గెలిస్తే రూ. 19.49 కోట్లు గెలుచుకుంటారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోతే రూ. 9.74 కోట్లతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక సెమీ-ఫైనలిస్టుల విషయానికొస్తే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు తలో రూ. 4.87 కోట్లు దక్కనున్నాయి.

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ తమ గ్రూపులలో మూడవ స్థానంలో నిలిచాయి. మరోవైపు, పాకిస్తాన్, ఇంగ్లాండ్ తమ తమ గ్రూపులలో చివరి స్థానంలో నిలిచాయి. దీంతో ఈ జట్లు తలో రూ. 1.21 కోట్లు అందుకుంటారు. అంతేకాకుండా, గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్‌ గెలిచిన జట్లు రూ. 29.5 లక్షలు గెలుచుకుంటాయి.

గ్రూప్ దశలో భారత్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. కాబట్టి రోహిత్ సేన ఇప్పటికే రూ. 88.5 లక్షలు గెలుచుకుంది. కాబట్టి, ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు మొత్తం రూ. 20.375 కోట్లు గెలుచుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిపోతే రూ. 10.625 కోట్లు గెలుచుకుంటారన్నమాట. అంటే భారత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 1కోటికిపైగానే అందనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..