IND vs NZ Final: ఫైనల్ పోరుకు వర్షం అడ్డంకి.. ఐసీసీ రూల్స్‌తో ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏదంటే?

India vs New Zealand Champions Trophy Final Gets Washed Out Rules: మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకునేందుకు భారత్, న్యూజిలాండ్ రెండూ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తూ, దూసుకొచ్చాయి. సెమీఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న భారత్ ఇప్పటికీ టోర్నమెంట్‌లో అజేయంగా ఉంది. అలాగే, న్యూజిలాండ్ మరో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది.

IND vs NZ Final: ఫైనల్ పోరుకు వర్షం అడ్డంకి.. ఐసీసీ రూల్స్‌తో ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏదంటే?
Ind Vs Nz Final Washed Out

Updated on: Mar 06, 2025 | 3:51 PM

India vs New Zealand Champions Trophy Final Gets Washed Out Rules: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ మైదానంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. టీం ఇండియా ఆస్ట్రేలియాను ఓడించగా, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. దీని కారణంగా ఈ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. ఈ క్రమంలో ఆతిథ్య పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఫైనల్ చేరడంతో.. టోర్నమెంట్ ఆతిథ్యం పాకిస్తాన్‌లో ముగిసినట్లైంది. ఇటువంటి పరిస్థితిలో, భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ సమయంలో వర్షం పడితే, ఏ జట్టు ఛాంపియన్ అవుతుందో, అసలు ఐసీసీ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐసీసీ నియమాలు ఏమంటున్నాయంటే?

నిజానికి, భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ దుబాయ్‌లో జరగాల్సి ఉంది. అక్కడ వర్షం పడే అవకాశం లేదు. అయితే, ఏదైనా సందర్భంలో వాతావరణం చెడుగా ఉంటే లేదా మ్యాచ్ రద్దు చేస్తే.. ఏ జట్టు ఛాంపియన్ అవుతుంది, ఈ మ్యాచ్ కోసం ఐసీసీ ఏ నియమాలను రూపొందించిందో ఒకసారి చూద్దాం..

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడితే, రిజర్వ్ డే ఏర్పాటు చేసుకునే నిబంధన ఉంది. దీనిలో ఆట మొదటి రోజు ఆగిపోయిన చోటు నుంచి ప్రారంభమవుతుంది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్‌లో ఫలితం రావాలంటే, కనీసం 25 ఓవర్లు ఆడటం అవసరం. ఆ తర్వాత DLS ఆధారంగా ఫలితాన్ని ప్రకటిస్తారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ టై అయితే, ఐసీసీ సూపర్ ఓవర్‌కు కూడా అవకాశం కల్పించింది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రెండు రోజులూ వర్షం పడి, ఏదైనా కారణం చేత ఫలితం నిర్ణయించబడకపోతే, భారత్, న్యూజిలాండ్ రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

25 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని టీం ఇండియా ఎదురుచూపులు..

మరోవైపు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు అది దుబాయ్ మైదానంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. 25 సంవత్సరాల క్రితం చివరిసారిగా టీం ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు ఈ ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..