Vaibhav Sooryavanshi : టీమిండియా సెలెక్ట్ చేయకపోతే మా దేశానికి వచ్చేయ్.. వైభవ్ సూర్యవంశీకి ఆ దేశం బంపర్ ఆఫర్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ బీహార్ సెన్సేషన్, తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

Vaibhav Sooryavanshi : టీమిండియా సెలెక్ట్ చేయకపోతే మా దేశానికి వచ్చేయ్.. వైభవ్ సూర్యవంశీకి ఆ దేశం బంపర్ ఆఫర్
Vaibhav Suryavanshi

Updated on: Mar 31, 2026 | 1:24 PM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ బీహార్ సెన్సేషన్, తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో వైభవ్ గురించి ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఐస్‌లాండ్ క్రికెట్ ఏమందంటే?

వైభవ్ సూర్యవంశీ నిర్భయంగా ఆడుతున్న తీరుకు ముగ్ధులైన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. “ఒకవేళ టీమిండియా వైభవ్‌ను సెలెక్ట్ చేయకపోతే, అతను ఐస్‌లాండ్ తరఫున ఆడేందుకు కావాల్సిన నాలుగు ఏళ్ల క్వాలిఫికేషన్ పీరియడ్ పూర్తి చేసినా.. అప్పటికి కూడా అతను టీనేజర్‌గానే ఉంటాడు. ఇది కేవలం ఒక ఊహ మాత్రమే” అంటూ సరదాగా ట్వీట్ చేసింది. అంటే వైభవ్ అంత చిన్న వయసులో అంతటి ప్రతిభను కనబరుస్తున్నాడని వారు చెప్పకనే చెప్పారు.

సినిమాను తలపించే ప్రయాణం

వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ఏదో సినిమా కథలా సాగుతోంది. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‎గా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు. అండర్-19 భారత జట్టులోనూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు ఐపీఎల్ 2026లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

సీఎస్కేపై వీరవిహారం

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ పట్టుకుంటే స్టేడియం హోరెత్తిపోయింది. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, సీఎస్కే బౌలర్లను చీల్చి చెండాడాడు. అటాకింగ్ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఈ కుర్రాడిని చూసి దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైభవ్ లాంటి టాలెంట్ ఉంటే భవిష్యత్తులో టీమిండియాకు తిరుగుండదని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us