WTC Final: చివరి 3 రోజుల్లో వర్షం.. రిజర్వ్ డేలోనూ ఫలితం తేలకుంటే.. డబ్ల్యూటీసీ విజేత ఎవరు?

|

Jun 06, 2023 | 7:09 PM

WTC Final 2023, Ind vs Aus: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ రేపు అంటే బుధవారం, జూన్ 7న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభం కానుంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈపోరు జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది.

WTC Final: చివరి 3 రోజుల్లో వర్షం.. రిజర్వ్ డేలోనూ ఫలితం తేలకుంటే.. డబ్ల్యూటీసీ విజేత ఎవరు?
Ind Va Aus Wtc 2023 Final
Follow us on

WTC Final 2023, Ind vs Aus: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ రేపు అంటే బుధవారం, జూన్ 7న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభం కానుంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈపోరు జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే కూడా ఉంది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే ఛాంపియన్‌ ఎవరు అవుతారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

టైటిల్ మ్యాచ్‌కు ముందు వర్షం ఈ మ్యాచ్‌లో ఉత్కంఠను చెడగొడితే అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. వాస్తవానికి, ఫైనల్ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు వాతావరణం స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, మూడవ, నాల్గవ రోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందంట. అయితే, జూన్ 12ని రిజర్వ్ డేగా ఉంచారు. అంతకుముందు, 2021లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్‌లో వర్షం కూడా పడటంతో మ్యాచ్ ఫలితం ఆరో రోజు అంటే రిజర్వ్ డేలో వెలువడింది.

మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఒక జట్టు కాదు, రెండు జట్లూ ఉమ్మడి విజేతలుగా నిలుస్తాయి. అంటే ట్రోఫీని ఇరు జట్లు పంచుకోనున్నాయి. మరోవైపు టైటిల్ మ్యాచ్ టై అయినప్పటికీ ఇరు జట్లు సంయుక్తంగా చాంపియన్లుగా మారతాయి. ICC నిబంధనల ప్రకారం, ఛాంపియన్‌షిప్ లేదా టోర్నమెంట్‌లో ఫైనల్ డ్రా అయినట్లయితే రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

భారత్‌ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..