ICC New Rule: పంత్‌తో అట్లుంటది.. కట్‌చేస్తే.. కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ..

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కొత్త రిప్లేస్‌మెంట్ రూల్‌ ను అమలు చేయనుంది. దీని ప్రకారం గాయపడిన ఆటగాడి స్థానంలో అదే నైపుణ్యం ఉన్న ఆటగాడిని తీసుకోవచ్చు. ఇది రిషబ్ పంత్ గాయం వంటి పరిస్థితుల్లో జట్టుకు నష్టం జరగకుండా ఆపడంలో సహాయపడుతుంది. అక్టోబర్ 2025 నుండి ఈ నిబంధన ట్రయల్‌గా అమలు చేయనున్నారు.

ICC New Rule: పంత్‌తో అట్లుంటది.. కట్‌చేస్తే.. కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ..
Rishabh Pant Injury

Edited By: Venkata Chari

Updated on: Jul 26, 2025 | 3:01 PM

ICC New Rule: అంతర్జాతీయ క్రికెట్ మండలి సబ్‌స్టిట్యూట్ నిబంధనపై ప్రస్తుతం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్‌లో రిషబ్ పంత్ గాయం తర్వాత, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కొత్త రిప్లేస్‌మెంట్ నిబంధనలు అమలులోకి వస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు మ్యాచ్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో మరొకరిని అనుమతిస్తాయి. అయితే, ప్రస్తుతానికి ఇది ట్రయల్ ప్రాతిపదికన మాత్రమే వర్తిస్తుంది.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఈ లైక్-ఫర్-లైక్ రిప్లేస్‌మెంట్ నిబంధన అక్టోబర్ 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిబంధన ప్రకారం, ఆటగాడికి తీవ్రమైన గాయం అయినప్పుడు మాత్రమే అతని స్థానంలో మరొకరిని రిప్లేస్ చేయవచ్చు. ఈ రూల్ ముఖ్య ఉద్దేశ్యం మ్యాచ్‌లో నిష్పక్షపాతాన్ని కొనసాగించడం. అంటే, ఒక ఆటగాడు గాయపడినప్పుడు ఆ జట్టుకు అనవసరంగా నష్టం జరగకుండా చూడటం.

ఈ కొత్త నిబంధన కేవలం తీవ్రమైన గాయాలకు మాత్రమే వర్తిస్తుంది. హ్యామ్‌స్ట్రింగ్ లేదా చిన్నపాటి నొప్పులు వంటి వాటికి ఇది వర్తించదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఆటగాడు గాయపడిన ఆటగాడి అన్ని బాధ్యతలను స్వీకరించడు. అంటే, గాయపడిన ఆటగాడికి పూర్తి సబ్‌స్టిట్యూట్ ను తీసుకోలేరు.

ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్‌లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రిషబ్ పంత్ గాయపడటం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. గాయం కావడానికి ముందు పంత్ 37 పరుగులు చేసి, పెద్ద స్కోరు వైపు వెళ్తున్నాడు. ఈ సిరీస్‌లో పంత్ ఇప్పటికే 450కి పైగా పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు, టెస్ట్ క్రికెట్‌లో ఈ కొత్త రిప్లేస్‌మెంట్ రూల్ ప్రస్తుతం అమలులో లేదు కాబట్టి, ఇది టీమిండియాకు బ్యాడ్ న్యూస్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..