IPL 2023: ఐసీసీ, బీసీసీఐ మధ్య బిగ్ ఫైట్.. ఆ తేదీలపై తర్జన భర్జనలు.. ఎందుకో తెలుసా?

|

Dec 07, 2022 | 7:59 AM

ICC World Test Championship: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఫైనల్స్‌లో ఆడే రెండు జట్లు ఎవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

IPL 2023: ఐసీసీ, బీసీసీఐ మధ్య బిగ్ ఫైట్.. ఆ తేదీలపై తర్జన భర్జనలు.. ఎందుకో తెలుసా?
Indian Cricket Team
Follow us on

ICC World Test Championship: ఐసీసీ టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించినప్పటి నుంచి, ఈ ఫార్మాట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తమ జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్‌ను గెలుస్తుందని అభిమానులు ఎలా ఆశిస్తారో, టెస్టు ఛాంపియన్‌షిప్ విషయంలోనూ ఇవే అంచనాలు వినిపిస్తుంటాయి. ఈ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్ ప్రస్తుతం జరుగుతోంది. దాని ఫైనల్ తేదీల గురించి కీలక వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు, IPL-2023 తేదీలపై కూడా కీలక వార్తలు వినిపిస్తున్నాయి.

క్రిక్‌బజ్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఈ టైటిల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఆడవచ్చని తెలుస్తోంది. రిజర్వ్ డే కోసం కూడా నిబంధన ఉంటుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే, తేదీలకు సంబంధించి ఐసీసీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

  1. మ్యాచ్ ప్రారంభ తేదీ ఐపీఎల్ పూర్తయ్యే తేదీకి చాలా దగ్గరగా ఉంటుంది. బీసీసీఐ ఐపీఎల్ తేదీలపై తర్న భర్జలు పడుతోంది. లీగ్ జూన్ 4 లేదా మే 28 న ముగియవచ్చని అంటున్నారు.
  2. లీగ్ జూన్ వరకు వెళితే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ ఆడుతుందని భావించి, ఐపీఎల్ తేదీల విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, బీసీసీఐ ఐపీఎల్-2023ని మార్చి 31 లేదా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక తర్వాతి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల్లో ఆశించిన ఫలితాలతో టీమిండియా ఫైనల్ ఆడగలదని అంచనాలు వినిపిస్తున్నాయి.
  5. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదటి ఎడిషన్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్ చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..