No 1 Test Team: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కోహ్లీసేన.. లార్డ్స్‌లో అమీతుమీ.. టెస్టుల్లో అగ్రస్థానం..

ICC World Test Championship Final: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి టీమిండియా సగర్వంగా అడుగుపెట్టింది. అహ్మదాబాద్‌...

No 1 Test Team: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కోహ్లీసేన.. లార్డ్స్‌లో అమీతుమీ.. టెస్టుల్లో అగ్రస్థానం..
Follow us

|

Updated on: Mar 06, 2021 | 5:30 PM

ICC World Test Championship Final: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి టీమిండియా సగర్వంగా అడుగుపెట్టింది. అహ్మదాబాద్‌ మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ తిప్పేశారు. ఈ మ్యాచ్ విజయంతో ఇంగ్లాండ్ 3-1తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

దీనితో టీమిండియా 72.2 విజయశాతంతో డబ్ల్యూటీసీ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. జూన్ 18వ తేదీన లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలబడనుంది. కాగా, ఈ విజయంతో టీమిండియా(118) టెస్ట్ ర్యాంకింగ్‌లోనూ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న న్యూజిలాండ్‌(118)ను వెనక్కినెట్టి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ లిస్టులో ఆ తర్వాత న్యూజిలాండ్(118), ఆస్ట్రేలియా(113), ఇంగ్లాండ్(108) జట్లు ఉన్నాయి.

నాలుగో టెస్టులో టీమిండియా విజయం…

టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్‌ వేసిన 54.5వ బంతికి లారెన్స్‌ (50) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

దీంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్​ మైదానంలో న్యూజిలాండ్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 205 పరుగులు చేయగా.. భారత్​ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్​కే కుప్పకూలింది.

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!