వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. అలాగే సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక ఆదివారం (అక్టోబర్ 30)న లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టి కరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 229 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 87 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తప్ప మిగతా భారత బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఆ తర్వాత 230 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగని ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు బెంబెలెత్తించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. కుల్ దీప్, జడేజా కూడా రాణించడంతో ఇంగ్లండ్ 129 పరుగులకే చాప చుట్టేసింది. 100 పరుగుల తేడాతో టీమిండియా ప్రపంచకప్‌లో వరుసగా ఆరో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మరో విశేషం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెలబ్రేషన్స్. ఇంగ్లండ్ వికెట్లు పడినప్పుడల్లా కోహ్లీ, హిట్ మ్యాన్ కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒక సందర్భంలో అయితే సంతోషంతో ఊగిపోయిన విరాట్.. రోహిత్ శర్మను పైకెత్తుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఈ బంధం చాలా ప్రత్యేకం. వీరిని ఇలా చూస్తుంటే ప్రపంచకప్ గెల్చినంత సంతోషంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయుల ప్రపంచకప్ కలను విరాట్, రోహిత్ నిజం చేయాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడితే, విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు.
Kids at heart. Absolutely love it. https://t.co/sOalTjqKDp pic.twitter.com/8iR3BYqaQ6
— Jaanvi🏏 (@that_shutterbug) October 29, 2023
Okay we get it , you both love each other, stop this PDA now 😭 pic.twitter.com/FDSm7P9QPQ
— Yashvi. (@BreatheKohli) October 29, 2023
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..