
Rohit Sharma: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 (ICC Cricket World Cup 2023) గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ ఈ రోజు భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ (India vs Netherlands) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి, 400లకు పైగా స్కోర్ సాధిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ (Ab De Villers) రికార్డును భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బద్దలు కొట్టాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో రోహిత్ 59 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 2015లో వన్డే ఫార్మాట్‌లో 58 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ పేరు మూడో స్థానంలో ఉంది. 2019లో వన్డేల్లో 56 సిక్సర్లు కొట్టాడు.
ఏబీ డివిలియర్స్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. నిజానికి ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2023 ప్రపంచకప్‌లో రోహిత్ ఇప్పటివరకు 23 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గాన్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. 2019 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా 22 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ పేరు మూడో స్థానంలో ఉంది. 2015 ప్రపంచకప్‌లో ఆఫ్రికన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతను 21 సిక్సర్లు కొట్టాడు.
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ భారత జట్టుకు శుభారంభం ఇస్తున్నాడు. రోహిత్ శర్మ స్టైల్‌ని అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు. అతని దూకుడు బ్యాటింగ్‌ను చూసి.. ఈసారి భారత జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుస్తుందని అభిమానులు పూర్తి ఆశతో ఉన్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..