IND vs AUS Final Umpires: ఫైనల్ మ్యాచ్‌కు ‘ఐరన్ లెగ్’ అంపైర్లు.. భారత ఓటమి ఖాయమంటోన్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

IND vs AUS Final, ICC World Cup 2023: ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం ఫేవరెట్ అయినప్పటికీ అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. నిజానికి ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్ల పేర్లను ఐసీసీ ఖరారు చేసింది. ఇందులో ఎంపికైన ఇద్దరు అంపైర్ల పేర్లు విన్న టీమిండియా అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.

IND vs AUS Final Umpires: ఫైనల్ మ్యాచ్‌కు ఐరన్ లెగ్ అంపైర్లు.. భారత ఓటమి ఖాయమంటోన్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?
Field Umpires For Ind Vs Au

Updated on: Nov 18, 2023 | 2:11 PM

IND vs AUS Final, ICC World Cup 2023, Richard Illingworth and Richard Kettleborough: నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం (Narendra Modi Stadium in Ahmedabad) ICC ప్రపంచ కప్ 2023 లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉంది. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం ఫేవరెట్ అయినప్పటికీ అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. నిజానికి ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్ల పేర్లను ఐసీసీ ఖరారు చేసింది. ఇందులో ఎంపికైన ఇద్దరు అంపైర్ల పేర్లు విన్న టీమిండియా అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి అభిమానుల ఈ ఆందోళనకు కారణమైన అంపైర్లు ఎవరు? వారిని ఐరన్ లెగ్ అంపైర్లు అని ఎందుకు పిలుస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

వీరే ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు..

రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, జోయెల్ విల్సన్‌లను ఫైనల్‌కు అంపైర్లుగా ICC నియమించింది. నవంబర్ 19 ఆదివారం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు జింబాబ్వే ఆటగాడు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తాడు. ఇంగ్లీష్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో వర్సెస్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా, ట్రినిడాడ్, టొబాగోకు చెందిన జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఫైనల్ మ్యాచ్ రిఫరీగా జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ పైక్రాఫ్ట్ హాజరుకానున్నారు.

గెలిచే మ్యాచ్‌ల్లో ఓడగొట్టిన అంపైర్లు..

నిజానికి, టీమ్ ఇండియా అభిమానులకు ఆందోళన కలిగించే ఆ ఇద్దరు అంపైర్లు పేరు ఏంటంటే.. రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. ముఖ్యంగా రిచర్డ్ కెటిల్‌బరో ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన 5 నాకౌట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ 5 మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా ఓడిపోయింది.

2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్, 2015 ప్రపంచకప్ సెమీ-ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్‌లో టీమ్ ఇండియా ఆడింది. వీటన్నింటిలో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోగా, రిచర్డ్ కెటిల్‌బరోను అంపైర్‌గా నియమించడం భారత అభిమానుల్లో భయాన్ని పెంచింది.

ఫైనల్ మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరోతో పాటు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. నిజానికి వీరిద్దరూ 2019లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఓదార్పునిచ్చే వాస్తవం ఏంటంటే?

అయితే, ఈ ప్రపంచకప్‌లో అతని అంపైరింగ్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించడం ఓదార్పునిచ్చే అంశం. నవంబర్ 15న ముంబైలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకడిగా నిలిచారు. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

ఫైనల్ మ్యాచ్ కోసం అంపైర్ల జాబితా..

ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్)

థర్డ్ అంపైర్: జోయెల్ విల్సన్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)

ఫోర్త్ అంపైర్: క్రిస్టోఫర్ గాఫ్నీ (న్యూజిలాండ్)

రిఫరీ ఆఫ్ ది మ్యాచ్: ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..