టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. ఐసీసీ నియమావళి ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించింది. శనివారం అఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ అలీం దార్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవెల్ 1తో పాటు ఆర్టికల్ 2.1ను కోహ్లీ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొంది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. ప్రస్తుతం అతని ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. రిఫరీ క్రిస్‌బ్రాడ్ ముందు కోహ్లీ తప్పును అంగీకరించాడు.
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన 29వ ఓవర్ తొలి బంతిని డిఫెన్స్ ఆడబోగా బంతి రహ్మత్ షా ప్యాడ్‌కు తగిలింది. బౌలర్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. సహచర ఆటగాళ్లతో చర్చించిన కోహ్లీ రివ్యూ కోరాడు. ఐతే బంతి ఔట్‌సైడ్ పిచ్ అయిందని ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయమని రివ్యూలో తేలింది. దీనిపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బంతి వికెట్ల పైకి వెళ్తున్నా ఔట్ ఇవ్వకపోవడంతో మైదానంలో విచిత్ర వ్యాఖ్యలతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
#ViratKohli has been found guilty of breaching the ICC Code of Conduct.#CWC19https://t.co/tqYof1z8RI
— ICC (@ICC) June 23, 2019