వరల్డ్ కప్ 2019: ఇంగ్లాండ్‌ను గెలిపించినోళ్లు అందరూ వలస వచ్చినవారే!
2019 క్రికెట్ వరల్డ్ కప్ ముగిసింది. గతంలో ఏ ప్రపంచ కప్ ఫైనల్ జరగనంతగా..ఇకముందు ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా? అని ఉహించనంతగా తుది పోరు జరిగింది. ఇరు జట్ల సభ్యులు విజయం కోసం ప్రాణం పెట్టారు. కానీ అదృష్టం ఆతిథ్య ఇంగ్లాండ్ వైపు నిలిచింది. సూపర్ ఓవర్‌లో కూడా టై అయిన మ్యాచ్‌లో..అత్యధిక బౌండరీలు కొట్టిన కోటాలో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. కానీ సరిగ్గా గమనిస్తే..ఇంగ్లాండ్ టీంను విజయ తీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాళ్లంగా […]
2019 క్రికెట్ వరల్డ్ కప్ ముగిసింది. గతంలో ఏ ప్రపంచ కప్ ఫైనల్ జరగనంతగా..ఇకముందు ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా? అని ఉహించనంతగా తుది పోరు జరిగింది. ఇరు జట్ల సభ్యులు విజయం కోసం ప్రాణం పెట్టారు. కానీ అదృష్టం ఆతిథ్య ఇంగ్లాండ్ వైపు నిలిచింది. సూపర్ ఓవర్‌లో కూడా టై అయిన మ్యాచ్‌లో..అత్యధిక బౌండరీలు కొట్టిన కోటాలో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. కానీ సరిగ్గా గమనిస్తే..ఇంగ్లాండ్ టీంను విజయ తీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాళ్లంగా విదేశాల నుంచి వలసవచ్చినవారే. వారిపై ఓ లుక్ వేద్దాం పదండి.
1.బెన్ స్టోక్స్
ఫైనల్‌లో జరిగిన రసవత్తర పోరులో వరుస వికెట్లు కోల్పోతున్న దశలో..ఎదురొడ్డి పోరాడింది.. న్యూజీల్యాండ్ విజయానికి బ్రేకులు వేసింది బెన్ స్టోక్స్. ఇతగాడిది వాస్తవానికి న్యూజీల్యాండే. అక్కడే క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టిన ఈ ఆల్ రౌండర్ 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లాండ్‌కు వలస వచ్చాడు. స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ ఒకప్పుడు న్యూజీల్యాండ్ రగ్బీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని ఒక రగ్బీ జట్టుకు కోచ్‌గా పనిచేసేందుకు కుటుంబంతో సహా వలసవచ్చాడు. బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్‌లోనే క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. 2011లో ప్రపంచకప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ ఆ జట్టుకు మంచి విజయాలను అందించాడు.
2. ఇయాన్ మోర్గాన్
జట్టును ముందుండి నడిపించిన వ్యక్తి..క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌కు 44 వరల్డ్ కప్ అందించిన సారథి ఇయాన్ మోర్గాన్‌ది ఐర్లాండ్ అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు. గతంలో ఐర్లాండ్ తరుపున ప్రాతినిథ్యం వహించిన మోర్గాన్.. 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. అయితే, మరింత తన ప్రతిభకు తగ్గ అవకాశాన్ని వెతుక్కుంటూ ఇంగ్లాండ్‌కు తరలివచ్చాడు. 2009లో జరిగిన ట్వంటీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు చెత్త ప్రదర్శన చేసినప్పుడు, 2019 విశ్వవిజేతగా నిలిచినప్పుడు కూడా మోర్గానే ఆ జట్టు కెప్టెన్.
3. జేసన్ రాయ్
ఈ వరల్డ్ కప్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించిన జోసన్ రాయ్‌ది సౌతాఫ్రికా. 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అతను వలసవచ్చాడు. మొదట దేశవాళీ క్రికెట్‌లో సర్రే తరఫున ఆడిన రాయ్ ఇండియాతో ఆడిన ట్వంటీ20తోనే జాతీయ జట్టులో అరంగేట్రం చేశాడు.
4. జోఫ్రా ఆర్చర్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అతి కీలకమైన సూపర్ ఓవర్‌ను బౌల్ చేసిన జోఫ్రా ఆర్చర్‌ది ఇంగ్లండ్ కాదు. కరేబియన్ దీవుల నుంచి అతను వలస వచ్చాడు. వెస్టిండీస్ అండర్ 19 క్రికెట్ జట్టులోనూ ఆడాడు. బార్డోడస్‌లో పుట్టిన ఆర్చర్ తండ్రి ఇంగ్లండ్ వాసి. 2019లో ససెక్స్ కౌంటీ క్రికెట్ తరఫున ఇంగ్లండ్‌లో ఆడటం మొదలు పెట్టిన ఆర్చర్ అతి త్వరలోనే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ నిబంధనల మూలంగా మొదట్లో 2022 వరకు ఆ దేశ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఆర్చర్‌కు రాకుండా పోయింది. అయితే ఆ తర్వాత కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. తన నిబంధనలను మార్చుకోవడంతో జాతీయ జట్టులోకి వచ్చాడు.