ICC Test Rankings: భారత నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా మారిన విరాట్ కోహ్లీ.. రోహిత్ ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?

విరాట్ కోహ్లీ రెండున్నరేళ్లుగా టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేయలేకపోయాడు. కానీ, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.

ICC Test Rankings: భారత నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా మారిన విరాట్ కోహ్లీ.. రోహిత్ ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?
Virat Kohli

Updated on: Mar 09, 2022 | 2:48 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి(Virat Kohli) సంచలనం సృష్టించాడు . టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ భారత నంబర్ వన్ టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఏడో స్థానంలో ఉన్న కోహ్లీ.. ప్రస్తుతం రెండు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ(Rohit Sharma) నిలిచాడు. రోహిత్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌(ICC Test Rankings)లో తాజా మార్పుల తర్వాత ఈ సంచలనం కనిపించింది. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుస్‌చాగ్నే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ నంబర్‌ టూ బ్యాట్స్‌మెన్‌‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

Also Read: 18 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాండ్.. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి..

MCC Cricket Rules: క్రికెట్‌ నిబంధనలలో మార్పులు.. ఇప్పుడు బాల్‌పై ఉమ్మివేయలేరు..!