PCB: పాక్ క్రికెట్ జట్టుకు బంపర్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే బ్లాంక్ చెక్ ఇస్తారటా.. పీసీబీ ప్రకటన..!

|

Oct 08, 2021 | 5:02 PM

భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకు ప్రత్యేకమే.. ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ ప్రేక్షకులే కాదు ఇతర దేశాల వారు ఎదురు చూస్తారు. ఇది వరకు జరిగిన వన్డే, టీ20 వరల్డ్ కప్‎ల్లో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎ల్లో ఇండియా పైచేయి సాధించింది...

PCB: పాక్ క్రికెట్ జట్టుకు బంపర్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే బ్లాంక్ చెక్ ఇస్తారటా.. పీసీబీ ప్రకటన..!
Ramizraju
Follow us on

భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకు ప్రత్యేకమే.. ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ ప్రేక్షకులే కాదు ఇతర దేశాల వారు ఎదురు చూస్తారు. ఇది వరకు జరిగిన వన్డే, టీ20 వరల్డ్ కప్‎ల్లో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎ల్లో ఇండియా పైచేయి సాధించింది. అందుకే  అక్టోబర్ 24న భారత్‎తో తలపడనున్న పాక్ జట్టకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మ్యాచ్‎లో ఇండియాను ఓడిస్తే బాబార్ అజామ్ నేతృత్వంలోని జట్టుకు బ్లాంక్ చెక్ లభిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా వెల్లడించారు.

“ఐసీసీ నిధులపై పీసీబీ నడుస్తుంది. ఐసీసీకి 90 శాతం నిధులు ఇండియా నుండి వస్తున్నాయి. ఇండియా ఐసీసీకి నిధులు ఇవ్వడం నిలిపివేస్తే పీసీబీకి నిధులు రావని భయపడుతున్న. పాకిస్థాన్ క్రికెట్‌ని పటిష్టంగా తీర్చిదిద్దడానికి నేను నిశ్చయించుకున్నాను “అని సెనేట్ స్టాండింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో రమీజ్ రాజా అన్నట్లు సమాచారం. “రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భారతదేశాన్ని ఓడిస్తే పీసీబీకి ఖాళీ చెక్ సిద్ధంగా ఉందని ఒక బలమైన పెట్టుబడిదారు నాకు చెప్పాడు” అని ఆయన చెప్పారు.

గత నెలలో న్యూజిలాండ్ ప్రభుత్వ భద్రతా హెచ్చరికలతో కివిస్ జట్టు పాకిస్థాన్‌తో పర్యటనను రద్దు చేసుకుంది. బోర్డుకు బలమైన ఆర్థిక సహాయం ఉంటే పాకిస్తాన్ పర్యటన నుండి జట్లు వైదొలగవని రమీజ్ రాజా అన్నారు. “ఉత్తమ క్రికెట్ జట్టు, ఉత్తమ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ రెండు పెద్ద సవాళ్లు” అని రమీజ్ అన్నారు. యూఏఈ, ఒమన్‌లో ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుండి ప్రారంభం కానుంది. నవంబర్ 14న ఫైనల్ జరగనుంది.

Read Also..  10 ఓవర్లలో 32 పరుగులు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.. ప్రపంచకప్ అందించాడు.. ఈ ఆటగాడు ఎవరంటే.!