T20 World Cup:153 ఫోర్లు, 69 సిక్సర్లు.. బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటర్.. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్‌

|

Sep 02, 2022 | 4:51 PM

England Cricket: తాజాగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొననున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు వచ్చింది.

T20 World Cup:153 ఫోర్లు, 69 సిక్సర్లు.. బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటర్.. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్‌
England Cricket Team
Follow us on

England Cricket: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచకప్‌ సన్నాహకాలు మొదలయ్యాయి. ఈనెల 15లోపు అన్ని జట్లు తమ సభ్యుల వివరాలను ఇవ్వాలని ఐసీసీ ఆదేశించడంతో ఒక్కో జట్టు తమ టీ 20 వరల్డ్‌కప్‌ స్వ్కాడ్‌లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా తన టీ20 వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించగా తాజాగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఈ టోర్నీలో భాగం కానున్న 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు వచ్చింది. అలాగే ఫాస్ట్ బౌలర్లు మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌లకు జట్టులో స్థానం దక్కింది. అయితే టీ20ల్లో స్టార్‌ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న జాసన్‌ రాయ్‌కు మొండిచేయ్యి ఎదురైంది.

ఫామ్ లేమి, గాయాలు..

ఇవి కూడా చదవండి

2019లో ఇంగ్లండ్‌ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రాయ్‌ కొన్ని నెలల నుంచి చాలా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. పైగా గాయాలు కూడా వెంటాడుతున్నాయి. ఈనేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ జట్టు నుంచి అతనికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ లోనూ పూర్తిగా నిరాశపర్చాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరగుతున్న ది హండ్రెడ్‌లో టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. రాయ్ స్థానంలో యువ ఓపెనర్ ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చాడు. కాగా మెగా టోర్నీలో కెప్టెన్ బట్లర్‌తో కలిసి జానీ బెయిర్‌స్టో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

టీ20 వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్‌ జట్టు ఇదే..
జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలాన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లే, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..