ICC Rankings: భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ అదరగొట్టాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. పింక్ టెస్టులో(66,25*) నిలకడైన ప్రదర్శన చేసిన రోహిత్.. బ్యాటింగ్ జాబితాలో ఏకంగా ఆరు స్థానాలు పైకి ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో న్యూజిల్యాండ్ కెప్టెన్ విలియమ్సన్ పస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 4, భారత కెప్టెన్ కోహ్లీ 5వ స్థానాలలో కొనసాగుతున్నారు.
బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 3వ స్థానానికి చేరకున్నాడు. ఈ లిస్టులో మరో భారత బౌలర్ బుమ్రా ఒక స్థానాన్ని కోల్పోయి 9వ స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఉన్నాడు. ఇటీవల టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా సెకండ్ ప్లేసులో ఉండగా.. అశ్విన్ ఐదో స్థానాన్ని పొందాడు. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
1. కేన్ విలియమ్సన్ – 919
2. స్టీవ్ స్మిత్ – 891
3. మార్నస్ లాబుస్చాగ్నే – 878
4. జో రూట్ – 853
4. విరాట్ కోహ్లీ – 836
6. బాబర్ ఆజం – 760
7. హెన్రీ నికోల్స్ – 747
8. రోహిత్ శర్మ = 742
9. డేవిడ్ వార్నర్ – 724
10. చేతేశ్వర్ పూజారా – 708
1. పాట్ కమ్మిన్స్ – 908
2. నీల్ వాగ్నెర్ – 825
3. ఆర్ అశ్విన్ – 823
4. జోష్ హాజిల్‌వుడ్ – 816
5. టిమ్ సౌతీ – 811
6. జేమ్స్ ఆండర్సన్ – 809
7. స్టువర్ట్ బ్రాడ్ – 800
8. కగిసో రబాడ – 753 9.
జస్‌ప్రీత్ బుమ్రా – 746
10. మిచెల్ స్టార్క్ – 744
India opener Rohit Sharma storms into the top 10 to a career-best eighth position in the latest @MRFWorldwide ICC Test Player Rankings for batting ?
Full list: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/Hqb9uTWnzJ
— ICC (@ICC) February 28, 2021
? Ashwin breaks into top three
? Anderson slips to No.6
? Broad, Bumrah move down one spotThe latest @MRFWorldwide ICC Test Player Rankings for bowling: https://t.co/AIR0KNm9PD pic.twitter.com/FssvpYiLcx
— ICC (@ICC) February 28, 2021
Also Read:
లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు
దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు