వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

World Cup 2027 Qualification Race: రాబోయే నెలల్లో జరిగే వన్డే సిరీస్‌లు ప్రతి జట్టుకు అత్యంత కీలకంగా మారనున్నాయి. బాటమ్ ర్యాంకింగ్‌లో ఉన్న జట్లు క్వాలిఫైయర్ల ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రతీ మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సి ఉంటుంది.

వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
World Cup 2027 Qualification

Updated on: Aug 09, 2026 | 8:35 AM

World Cup 2027 Qualification: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీకి ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్‌తో పాటు పలు ప్రధాన జట్లు నేరుగా అర్హత సాధించే దిశగా దూసుకుపోతున్నాయి.

2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. గతంలో 10 జట్లు మాత్రమే పోటీ పడగా, ఈసారి ఐసీసీ టోర్నీ పరిమాణాన్ని పెంచి మొత్తం 14 జట్లకు అవకాశం కల్పించింది. ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా, మరో సహ వేదిక అయిన నమీబియా మాత్రం ఆతిథ్య కోటా పొందలేకపోయింది. మిగిలిన స్థానాల కోసం ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

భారత్ అగ్రస్థానం.. డైరెక్ట్ క్వాలిఫికేషన్ దాదాపు ఖాయం..

ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ ద్వితీయ స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. ర్యాంకింగ్స్ కటాఫ్ తేదీ నాటికి టాప్-8 లో నిలిచే జట్లు క్వాలిఫైయర్ రౌండ్ ఆడాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రధాన టోర్నీలో పోటీపడతాయి. భారత జట్టు పాయింట్ల పరంగా చాలా స్పష్టమైన ఆధిక్యంలో ఉండటంతో నేరుగా ప్రపంచకప్ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా సురక్షితమైన స్థానాల్లో ఉన్నాయి.

పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల లెక్కలేంటి..?

ర్యాంకింగ్స్ జాబితాలో పాకిస్తాన్ 100 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానంలో నిలవగా, శ్రీలంక (96) 6వ స్థానంలో, ఇంగ్లాండ్ (93) 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ జట్లు నేరుగా అర్హత సాధించే రేసులోనే ఉన్నప్పటికీ, కటాఫ్ తేదీ వరకు స్థానాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరగబోయే మూడు వన్డేల సిరీస్ ఈ రెండు జట్ల ర్యాంకింగ్ పాయింట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ 90 పాయింట్లతో 8వ స్థానంలో ఉంటూ క్వాలిఫికేషన్ అంచున నిలిచింది.

క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే మరో నాలుగు జట్లు..

ర్యాంకింగ్స్ ద్వారా ఎంపికయ్యే 8 జట్లు, ఇద్దరు ఆతిథ్య దేశాలు కాకుండా మిగిలిన 4 స్థానాల కోసం గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహించనున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2 నుంచి వచ్చే టాప్ జట్లతో పాటు ఛాలెంజ్ లీగ్ విజేతలు ఈ క్వాలిఫైయర్‌లో తలపడతారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నాలుగు జట్లు మెగా టోర్నీలో అడుగుపెట్టి 14 జట్ల స్క్వాడ్‌ను పూర్తి చేస్తాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us