ICC ODI World Cup 2023: అస్పత్రిలో చేరిన టీమిండియా నెంబర్ 2 ప్లేయర్.. దాయాది మ్యాచ్‌కు దూరమైనట్లే..!

|

Oct 10, 2023 | 1:14 PM

ICC ODI World Cup 2023: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్.. ప్లేట్‌లెట్స్ కౌంట్‌ పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో శుభ్‌మన్ గల్ అడ్మిట్ అయ్యాడు. వైద్య నిపుణుల సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు. బీసీసీఐ వైద్యుడు రిజ్వాన్ ఖాన్ కూడా శుభ్‌మన్ గిల్ వెంట ఉంటున్నాడు. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య..

ICC ODI World Cup 2023: అస్పత్రిలో చేరిన టీమిండియా నెంబర్ 2 ప్లేయర్.. దాయాది మ్యాచ్‌కు దూరమైనట్లే..!
Shubman Gill
Follow us on

ICC ODI World Cup 2023: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్.. ప్లేట్‌లెట్స్ కౌంట్‌ పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో శుభ్‌మన్ గల్ అడ్మిట్ అయ్యాడు. వైద్య నిపుణుల సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు. బీసీసీఐ వైద్యుడు రిజ్వాన్ ఖాన్ కూడా శుభ్‌మన్ గిల్ వెంట ఉంటున్నాడు. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో పాల్గొనేందుకు శుభ్‌మన్ గిల్ రాగా.. అతను అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి చెన్నైలోనే బీసీసీఐ కేటాయించిన హోటల్‌ గదిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే, ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్ శరీరంలో ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో.. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ తెలిపింది. ‘ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోయినందున అతనికి రెస్ట్ అవసరం. వైద్యుల సూచన మేరకు తదుపరి మ్యాచ్‌కు కూడా గిల్ అందుబాటులో ఉండడు.’ అని ధృవీకరిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన చేసింది.


కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గిల్ ఆడుతాడా? ఆడడా? అనేది సందిగ్ధంగా మారింది. మ్యాచ్ సమయానికి శుభ్‌మన్ కోలుకునే అవకాశం ఉందని టీమ్ మేనేజ్‌మెంట్ ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం అయితే గిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే అతన్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు వైద్యులు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. అక్కడి నుంచి గిల్ నేరుగా అహ్మదాబాద్‌ మ్యాచ్‌కు అటెండ్ అయ్యే అవకాశం ఉందన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..