IND vs AUS: కల చెదిరింది.. ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్ బోల్తా.. ఆరోసారి విశ్వ విజేతగా ఆస్ట్రేలియా

|

Nov 19, 2023 | 9:54 PM

కోట్లాది మంది భారతీయ అభిమానుల కల చెదిరింది. స్వదేశంలో ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన కీలక మైన ఫైనల్‌ మ్యాచ్‌లో బోల్తా పడింది. ఆదివారం (నవంబర్‌ 19) ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

IND vs AUS: కల చెదిరింది.. ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్ బోల్తా.. ఆరోసారి విశ్వ విజేతగా ఆస్ట్రేలియా
India Vs Australia
Follow us on

కోట్లాది మంది భారతీయ అభిమానుల కల చెదిరింది. స్వదేశంలో ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన కీలక మైన ఫైనల్‌ మ్యాచ్‌లో బోల్తా పడింది. ఆదివారం (నవంబర్‌ 19) ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని లక్ష్యాన్ని ఆసీస్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ట్రెవిస్‌ హెడ్‌ భారీ (120 బంతుల్లో 137) భారీ సెంచరీతో చెలరేగగా, మార్నస్‌ లబుషేన్‌ (58) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ అభేద్యమైన మూడో వికెట్ కు 194 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లతో బుమ్రా 2 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్‌ పడగొట్టారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ పేలవమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సరిగ్గా 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. కేఎల్‌ రాహుల్‌(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విరాట్‌ కోహ్లీ (54), రోహిత్‌ శర్మ(47) పరుగులతో రాణించారు. గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవీంద్ర జడేజా (9), సూర్య కుమార్‌ యాదవ్ (18), మహ్మద్‌ షమీ (6), జస్‌ ప్రీత్ బుమ్రా (1), కుల్‌ దీప్‌ యాదవ్‌ (10), మహ్మద్ సిరాజ్‌ (9) నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3 కీలక వికెట్లు తీయగా, హాజెల్‌ వుడ్, కమిన్స్‌ తలా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్‌ వెల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ట్రెవిస్ హెడ్ నిలిచాడు.

ఆరోసారి జగజ్జేతగా ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా తొలిసారిగా 1987లో ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1999, 2003, 2007, 2015లో కూడా ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆరోసారి ప్రపంచకప్ ను ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.