ICC ODI Rankings: టీమిండియా దెబ్బకు కివీస్ ఢమాల్.. మ్యాచ్‌, సిరీస్ మాత్రమే కాదు.. అగ్రస్థానం కూడా పాయే..

India vs New Zealand: న్యూజిలాండ్ నుంచి నంబర్ వన్ కిరీటం పోయింది. రెండో వన్డేలో రోహిత్ శర్మ జట్టు విజయం సాధించడంతో భారత్‌తో పాటు ఇంగ్లండ్ కూడా లాభపడింది.

ICC ODI Rankings: టీమిండియా దెబ్బకు కివీస్ ఢమాల్.. మ్యాచ్‌, సిరీస్ మాత్రమే కాదు.. అగ్రస్థానం కూడా పాయే..
Ind Vs Nz

Updated on: Jan 22, 2023 | 1:04 PM

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ మ్యాచ్‌లోనే కాదు.. తన స్థానాన్ని కూడా కోల్పోయింది. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఓడిపోయి, సిరీస్‌ను కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నంబర్ వన్ కిరీటాన్ని కూడా కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

న్యూజిలాండ్ నుంచి నంబర్ వన్ కిరీటం పోయింది. రెండో వన్డేలో రోహిత్ శర్మ జట్టు విజయం సాధించడంతో భారత్‌తో పాటు ఇంగ్లండ్ కూడా లాభపడింది. రాయ్‌పూర్‌లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది.

ఇవి కూడా చదవండి

భారత్ విజయంతో లాభపడిన ఇంగ్లండ్..

అదే సమయంలో, ఇంగ్లండ్ నంబర్ వన్ కుర్చీని ఆక్రమించింది. రాయ్‌పూర్‌కు ముందు హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌ను కూడా భారత్ ఓడించింది. దీనితో కివీ జట్టు కూడా సిరీస్‌ను కోల్పోయింది. అదే సమయంలో రెండో వన్డేలో విజయం సాధించడంతో భారత్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ 115 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 113 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో, 112 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 111 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి.

టాప్ 3లో టీంలు ఇవే..

భారత్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన న్యూజిలాండ్ 113 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, భారత్‌లు ఒకే రేటింగ్‌ 113తో ఉన్నాయి. అంటే వన్డేల్లో భారత్ నంబర్ వన్ జట్టుగా అవతరించే అవకాశం ఉంది. మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తే భారత్‌కు నంబర్‌వన్‌ స్థానం దక్కుతుంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత వన్డేల్లో భారత్ నంబర్ వన్ జట్టుగా అవతరించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..