SL vs IND: జైస్వాల్, ఫెర్నాండో గొడవపై ఐసీసీ కీలక నిర్ణయం.. జరిమానాతోపాటు షాకిచ్చిందిగా..!
ICC Fines Yashasvi Jaiswal vs Asitha Fernando Test Fight: మైదానంలో సహనం కోల్పోయిన భారత యువ ఓపెనర్‌తోపాటు శ్రీలంక ప్లేయర్‌కు ఐసీసీ భారీగా షాకిచ్చింది. జరిమానాతోపాటు డీమెరిట్ పాయింట్లను అందించింది. దీంతో మైదానంలో ఇలాంటి చర్యలకు పాల్పడే ప్లేయర్లుకు ఇది ఒక హెచ్చరికగా మారింది.

ICC Fines Yashasvi Jaiswal vs Asitha Fernando Test Fight: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ప్రత్యర్థి పేసర్ అసిత ఫెర్నాండో మైదానంలో నేరుగా ఢీకొన్న ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీవ్రంగా స్పందించింది. ఇద్దరు ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయం వెలువరించింది. రెండో టెస్టు మొదటి రోజు ఆటలో చోటుచేసుకున్న ఈ శారీరక ఘర్షణను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండో ఇద్దరి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఇద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 ప్రకారం ఆటగాళ్లు, సిబ్బంది లేదా అంపైర్లతో అనుచిత శారీరక స్పర్శకు పాల్పడటం నిషిద్ధం. అయితే గత 24 నెలల కాలంలో ఇద్దరికీ ఇది తొలి తప్పిదం కావడంతో మ్యాచ్ నిషేధం విధించకుండా జరిమానాతో సరిపెట్టింది.
మైదానంలో అసలేం జరిగింది?
భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఆఖరి బంతికి ఈ వివాదం చెలరేగింది. అసిత ఫెర్నాండో వేసిన అద్భుతమైన డెలివరీకి జైస్వాల్ ఆఫ్ స్టంప్ ఎగిరిపడింది. కీలక వికెట్ దక్కడంతో లంక పేసర్ తీవ్ర భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నాడు. నిరాశతో పెవిలియన్ వైపు అడుగులు వేస్తున్న జైస్వాల్‌ను ఉద్దేశించి ఫెర్నాండో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది.
తలలతో ఢీకొట్టుకున్న ఆటగాళ్లు..
లంక బౌలర్ మాటలతో ఆగ్రహానికి గురైన జైస్వాల్ వెనక్కి తిరిగి అతడిని నిలదీశాడు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరూ పరస్పరం తలలతో ఢీకొట్టుకునే (హెడ్‌బట్) స్థాయికి ఘర్షణ చేరింది. వెంటనే మిగిలిన సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇరువరినీ విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం జైస్వాల్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
