సర్ఫరాజ్ నోటి దురుసు..ఇండియా ఫ్యాన్స్ గరం గరం
టాంటాన్ : భారత్- పాకిస్థాన్ రెండు దాయాది దేశాలు. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక క్రికెట్ విషయంలో అయితే రెండు దేశాల మధ్య వైరం మాములుగా ఉండదు. ఆటగాళ్ల మధ్య కూడా పోటీ పోటి దూషణలు జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్‌లో భావోద్వేగానికి గురైనా సందర్భాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా వరల్డ్ కప్ సందర్భంగా ఇండియన్ ఫ్యాన్స్ చేసిన పనిని ఉదహరిస్తూ సర్ఫరాజ్ వెటకారంగా మాట్లాడాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ […]
టాంటాన్ : భారత్- పాకిస్థాన్ రెండు దాయాది దేశాలు. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక క్రికెట్ విషయంలో అయితే రెండు దేశాల మధ్య వైరం మాములుగా ఉండదు. ఆటగాళ్ల మధ్య కూడా పోటీ పోటి దూషణలు జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్‌లో భావోద్వేగానికి గురైనా సందర్భాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా వరల్డ్ కప్ సందర్భంగా ఇండియన్ ఫ్యాన్స్ చేసిన పనిని ఉదహరిస్తూ సర్ఫరాజ్ వెటకారంగా మాట్లాడాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘పాక్ ఫ్యాన్స్ క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లను గౌరవిస్తారు. స్మిత్‌ను గత మ్యాచ్‌లో కొందరు ఎగతాళి చేసినట్లు తెలిసింది. కానీ పాక్ ఫ్యాన్స్ అలా ఎప్పటికీ చేయరు. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను కించపరిచేలా మా వాళ్లు ప్రవర్తించరు’ అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ అభిమానులు కొందరు స్మిత్ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ఇండియన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ… అలా ప్రవర్తించకుండా.. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అయినా కూడా సర్ఫరాజ్ ఇండియా ఫ్యాన్స్‌ని టీజ్ చేయడంతో మన వాళ్లు కూడా సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నాడు.