Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్ల విక్రయం షురూ.. ధర ఎంత, ఎలా కొనుగోలు చేయాలంటే?

Champions Trophy Tickets: పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌ల టిక్కెట్ విక్రయాలను ప్రారంభించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు జనవరి 28 నుంచి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. అయితే, భారత మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలపైనా కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్ల విక్రయం షురూ.. ధర ఎంత, ఎలా కొనుగోలు చేయాలంటే?
Champions Trophy Tickets

Updated on: Jan 27, 2025 | 9:45 PM

Champions Trophy Tickets: పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌ల టిక్కెట్ విక్రయాలను ప్రారంభించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు జనవరి 28 నుంచి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. లాహోర్, కరాచీ స్టేడియంలు ఇంకా పూర్తిగా సిద్ధం కానప్పటికీ, ఐసీసీ వాటి కోసం వేచి ఉండకుండా టిక్కెట్ల విక్రయ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరాచీ, లాహోర్ స్టేడియాలు జనవరి 30 నాటికి సిద్ధంగా ఉన్నాయని నివేదించింది. ఫిబ్రవరి 5వ తేదీలోగా వాటిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తోంది. అయితే, భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించనున్నారు.

ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ ధరలను ఇంకా విడుదల చేయలేదు. దుబాయ్‌లో జరిగే మొదటి సెమీ ఫైనల్ తర్వాత దీని సేల్ ప్రారంభమవుతుంది. టిక్కెట్ల విక్రయాల గురించి ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా మాట్లాడుతూ, ‘పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టిక్కెట్ విక్రయాలను అధికారికంగా ప్రకటించడం పట్ల ఐసీసీ థ్రిల్‌గా ఉంది. పాకిస్థాన్‌లో క్రికెట్‌కు ఇది ఒక ముఖ్యమైన క్షణం, 1996 తర్వాత తొలిసారిగా అక్కడ గ్లోబల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్ ధర ఎంత?

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టిక్కెట్ల ధరను కూడా ఐసీసీ వెల్లడించింది. దీని ప్రకారం, స్టాండర్డ్ టికెట్ కనీస ధర 1000 పాకిస్తానీ రూపాయలు (రూ. 310), ప్రీమియం టిక్కెట్ ధర 1500 పాకిస్తానీ రూపాయలు (రూ. 465)గా ఉంచారు. పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ల గరిష్ట టిక్కెట్ ధర 25 వేల పాకిస్థానీ రూపాయలు. పాకిస్తాన్ మ్యాచ్‌లకు కనీస ధర 2000 పాకిస్తానీ రూపాయలు. పాకిస్థాన్‌లో జరిగే రెండో సెమీ-ఫైనల్ టిక్కెట్ల ధర 2500 పాకిస్థానీ రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన టిక్కెట్ 25 వేల పాకిస్తానీ రూపాయలు.

ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?

ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి, అభిమానులు ముందుగా ICC అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. జనవరి 28న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ టిక్కెట్‌లను https://www.icc-cricket.com/tournaments/champions-trophy-2025 నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. దుబాయ్‌లో జరగనున్న భారత్‌ మ్యాచ్‌ల టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభం కాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..