IPL 2023: రోహిత్ కెప్టెన్సీకి నేనో పెద్ద ఫ్యాన్‌ని.. ప్రశంసల జల్లు కురిపించిన టీమిండియా దిగ్గజం..

IPL 2023, Rohit Sharma: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ రోజుల్లో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ గాయపడ్డాడు.

IPL 2023: రోహిత్ కెప్టెన్సీకి నేనో పెద్ద ఫ్యాన్‌ని.. ప్రశంసల జల్లు కురిపించిన టీమిండియా దిగ్గజం..
Team India Rohit Sharma

Updated on: May 17, 2023 | 8:40 PM

KL Rahul On Rohit Sharma Captaincy: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ రోజుల్లో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ గాయపడ్డాడు. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన వేగంగా కోలుకుంటున్నారు. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీపై తాజాగా రాహుల్ మాట్లాడారు. రోహిత్ కెప్టెన్సీని తీవ్రంగా కొనియాడాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టీమ్ ఇండియా కమాండ్‌ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించారు. యూట్యూబ్ ఛానెల్ ‘బీర్ బైసెప్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి కేఎల్ రాహుల్ ప్రశంసల జల్లు కురిపించాడు. “రోహిత్ శర్మ నాయకుడిగా చాలా స్పీడ్‌గా ఉంటాడు. అతను ఆటకు ముందు చాలా హోంవర్క్ చేస్తాడు. ప్రతి ఆటగాడి బలాలు తెలుసు. ఆటపై చాలా మంచి అవగాహన ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

రాహుల్ గాయం, శస్త్రచికిత్స గురించి మాట్లాడుతూ, “ శస్త్రచికిత్స జరిగింది. అది విజయవంతమైంది. నేను సౌకర్యంగా ఉన్నాను, ప్రస్తుతం అంతా బాగానే ఉంది. వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. నేను ఇప్పుడు కోలుకునే మార్గంలో ఉన్నాను. నా వంతు కృషి చేసి మళ్లీ మైదానంలోకి రావాలని నిశ్చయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

IPL 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్..

కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా 9 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 34.25 సగటు, 113.22 స్ట్రైక్ రేట్‌తో 274 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్‌లో రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి.

విశేషమేమిటంటే, రాహుల్ ఐపీఎల్‌తో పాటు జూన్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు కూడా దూరం కావడం గమనార్హం. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను భారత జట్టులో చేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..