WPL 2023: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి హాఫ్ సెంచరీ..
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. అంతేకాక ఆ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా డబ్ల్యూపీఎల్..
MIW vs GGW 2023: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఆరంగేట్ర సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కొనసాగుతోంది. అయితే ఈ తొలి మ్యాచ్‌లోనే మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. అంతేకాక ఆ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోయేలా.. మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.