Natasha Stankovic: ఆ పుకార్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన హార్దిక్ మాజీ భార్య నటాసా..!

| Edited By: Janardhan Veluru

Nov 10, 2024 | 5:28 PM

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా సెర్బియాకు వెళ్లిపోతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు చెక్ పెట్టింది. తాను సెర్బియాకు తిరిగి వెళ్ళే అవకాశం లేదని స్పష్టం చేసింది. హార్దిక్‌తో విడిపోయినా, అగస్త్య కోసం ఎల్లప్పుడూ కలిసి ఉంటామని తెలిపింది. తన జీవితం తన కొడుకుకు అంకితం చేసినట్లు వెల్లడించింది నటాసా.

Natasha Stankovic: ఆ పుకార్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన హార్దిక్ మాజీ భార్య నటాసా..!
Natasa Hardik
Follow us on

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా తన కొడుకు అగస్త్యతో కలిసి దేశం విడిచి వెళ్లిపోతుందన్న పుకార్లు చెక్ పెట్టింది.  గత జులైలో తాము విడాకులు తీసుకుంటన్నట్లు నటాషా, హార్దిక్ లు ప్రకటించిన తరువాత నుంచి కుమారుడు అగస్త్యతో కలిసి నటాసా ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఆమే సెర్బియాకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఉహాగానాలు మొదలయ్యాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటాసా ఈ పుకార్లకు చెక్ పెట్టింది. ఈటీమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నటాసా తమ విడాకుల గురించి ప్రస్తావించడమే కాకుండా, మాజీ భర్త హార్దిక్‌తో పాటు కోడుకు అగస్త్య గురించి మాట్లాడింది. భారత్‌ను విడిచిపెట్టి సెర్బియాకు తిరిగి వెళ్లడంపై వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది నటాసా..  నేను ఎలా తిరిగి వెళ్తాను? నాకు ఒక కుమారుడు ఉన్నాడు. అగస్త్య ఇక్కడే పాఠశాలకు వెళ్తున్నాడు. అటువంటి సమయంలో నేను సెర్బియా వెళ్లే అవకాశమే లేదు. అలా ఎట్టిపరిస్థితుల్లో జరగదు. 10 సంవత్సరాలుగా నేను ప్రతి సంవత్సరం సెర్బియాకు వెళ్లి వస్తాను. అంతే కానీ నేను ఎక్కడి వెళ్లిపోలేదని స్పష్టం చేసింది.

నేను హార్దిక్ విడిపోయిన తామంతా ఒక కుటుంబమే.. ఎందుకంటే అగస్త్య తల్లితండ్రులిద్దరితో కలిసి ఉండాలి. అగస్త్య కోసమే ఓ ఫ్యామిలీగా కొనసాగుతున్నాం. నేను హార్డిక్ తో కలిసి ఉండలేను కానీ, అగస్త్యకు మాత్రం ఇద్దరం పేరెంట్స్ గా ఉంటామని చెప్పుకొచ్చారు. తన జీవితం ఇప్పుడు తన 4 ఏళ్ల కొడుకు చుట్టూ తిరుగుతుందని.. తన కొడుకు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తాను చేసిన వాగ్దానాల చుట్టూ తిరుగుతుందని ఆమె తెలిపారు. నాచ్ బలియే 9 స్టార్ అనే షోలో కూడా అగస్త్య సంతోషమే తన మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది నటాసా.

మానసిక ఆరోగ్యంపై నటాసా

మానసికంగా సంతోషంగా ఉండాల్సిందేనని, వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేదని చెప్పిన నటాసా.. ఎవరెన్ని చెప్పినా, మీ ఉద్దేశాలు సూటిగా ఉంటే, మీ హృదయం స్వచ్ఛమైనది అయితే ఆ క్షణం మీరు దేనికి తలొగ్గాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొన్న తరువాత తన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించిన నటాసా.. తన కుమారుడి కోసం సంతోషంగా ఉంటున్నానని ఇక ముందు కూడా ఇలాగే సంతోషంగా ఉంటానని చెప్పారు.