IND vs PAK: పాకిస్తాన్ బౌలర్‌ ఓవరాక్షన్‌.. వెంటనే ఇచ్చిపడేసిన కుంగ్‌ఫూ పాండ్యా.. అయినా వదలని నెటిజన్లు..

| Edited By: Prudvi Battula

Sep 03, 2023 | 2:18 PM

IND vs PAK: రోహిత్, కోహ్లీ, అయ్యర్ వంటి ప్లేయర్లను పెవిలియన్‌కి పాక్ బౌలర్లపై ఇషాన్ విజృంభించాడు. అలాంటి ఇషాన్‌ హారీస్ రవుఫ్ వేసిన 38వ ఓవర్ 3 బంతికి ఔట్ అయ్యాడు. దీంతో పాక్ బౌలర్ రవుఫ్ వెంటనే ‘నికాల్ నికాల్’ అన్నట్లుగా ఇషాన్‌కి వేలు చూయిస్తూ ఓవర్ చేశాడు. అయితే దీన్ని ఇషాన్ పట్టించుకోకపోయినా.. అప్పటికి మైదానంలోనే ఉన్న హార్దిక్ సీరియస్‌గా తీసుకున్నాడు. రవుఫ్ వేసిన 38వ ఓవర్‌లో ఇషాన్ పెవిలియన్ చేరగా.. అతను వేసిన 40 ఓవర్‌లో హార్దిక్ తన కుంగ్‌ఫూ స్టైల్‌లో..

IND vs PAK: పాకిస్తాన్ బౌలర్‌ ఓవరాక్షన్‌.. వెంటనే ఇచ్చిపడేసిన కుంగ్‌ఫూ పాండ్యా.. అయినా వదలని నెటిజన్లు..
Ishan Kishan Vs Haris Rauf
Follow us on

యావత్ క్రికెట్ ప్రపంచం ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌‌కి వరుణుడు అడ్డురావడంతో ఫలితం తేలకుండానే పోరు ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులకే పరిమితమవ్వగా.. తర్వాత పాకిస్తాన్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. సమయం గడుస్తున్నా వర్షం ఆగకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తూ మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన పాయింట్, అంతక ముందు నేపాల్‌పై సాధించిన రెండు పాయింట్లతో పాక్ జట్టు గ్రూప్ ఏ నుంచి నేరుగా సూపర్ 4 దశకు అర్హత సాధించింది.

అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా శుభారంభం చేయలేకపోయింది. 66 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ (11), శుభమాన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయాస్ అయ్యర్ (14) రూపంలో నాలుగు వికెట్లను కోల్పోయిన భారత జట్టుకు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్(82), హార్దిక్ పాండ్యా(87) 5వ వికెట్‌కి 138 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే టెయిలెండర్ బ్యాట్స్‌మ్యాన్ బూమ్రా 3 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిదీ 4.. హారీస్ రవుఫ్, నసీమ్ షా చెరో 3 వికెట్లు తీసుకున్నారు.

పాక్‌ బౌలర్లపై ఇషాన్ షాట్లు.. 

హారీస్ బౌలింగ్‌లో ఇషాన్ అప్పర్ కట్..

అయితే మ్యాచ్ సమయంలో పాక్ బౌలర్ల హారీస్ రవుఫ్ ఓవరాక్షన్‌పై క్రికెట్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ, అయ్యర్ వంటి ప్లేయర్లను పెవిలియన్‌కి పాక్ బౌలర్లపై ఇషాన్ విజృంభించాడు. అలాంటి ఇషాన్‌ హారీస్ రవుఫ్ వేసిన 38వ ఓవర్ 3 బంతికి ఔట్ అయ్యాడు. దీంతో పాక్ బౌలర్ రవుఫ్ వెంటనే ‘నికాల్ నికాల్’ అన్నట్లుగా ఇషాన్‌కి వేలు చూయిస్తూ ఓవర్ చేశాడు. అయితే దీన్ని ఇషాన్ పట్టించుకోకపోయినా.. అప్పటికి మైదానంలోనే ఉన్న హార్దిక్ సీరియస్‌గా తీసుకున్నాడు. రవుఫ్ వేసిన 38వ ఓవర్‌లో ఇషాన్ పెవిలియన్ చేరగా.. అతను వేసిన 40 ఓవర్‌లో హార్దిక్ తన కుంగ్‌ఫూ స్టైల్‌లో పాక్ బౌలర్‌కి (4,4,0,4,0,0) వడ్డించాడు. కానీ పాక్ బౌలర్‌ని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు మాత్రం వదలకుండా వాయించేస్తున్నారు.

ఇచ్చేపడేస్తాం  కాస్కో.. 

బుద్ధి మారదు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..