
Hardik Pandya CSK Trade: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన తర్వాత, మైదానంలో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్, హార్దిక్ పాండ్యా చాలా సేపు సీరియస్‌గా చర్చించుకున్నారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ (2026)లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రత్యర్థి జట్టు బాస్‌తో హార్దిక్ చర్చలు జరపడం ట్రేడింగ్ రూమర్లకు ఆజ్యం పోసింది. గతంలో సంజూ శామ్సన్ కూడా ఇలాగే కాశీ విశ్వనాథన్‌తో మాట్లాడటం, ఆ తర్వాత ఆయన సీఎస్‌కేలోకి రావడం గమనార్హం.
రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై ముంబై అభిమానులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు జట్టు వరుస వైఫల్యాలు హార్దిక్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ సైతం హార్దిక్‌ను ముంబై వదిలేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. వరుసగా రెండు సీజన్లలో జట్టు విఫలమయ్యాక, కెప్టెన్సీ నుంచి తప్పించి అతడిని జట్టులో ఉంచడం హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని డౌల్ పేర్కొన్నారు.
Hardik Pandya Traded To CSK 💛🔒 Deal Locked … Just Formalities are Pending 😜
WELCOME TO CSK 💛 pic.twitter.com/DjNQytHcot
— Mahi💛 (@Thalapaglu_7) May 3, 2026
ఒకవేళ ఐపీఎల్ 2027 వేలానికి ముందే హార్దిక్ పాండ్యాను సీఎస్‌కే ట్రేడ్ చేసుకోవాలనుకుంటే, కింది మూడు అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది:
1. శివమ్ దూబేతో ట్రేడ్: హార్దిక్, శివమ్ దూబే ఇద్దరూ టీమ్ ఇండియాలో కీలక ఆల్‌రౌండర్లు. అయితే దూబే గత రెండు సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముంబైకి చెందిన దూబేను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చి, హార్దిక్‌ను చెన్నై తీసుకోవచ్చు. అయితే వీరిద్దరి ధరల మధ్య వ్యత్యాసం ఉన్నందున, అదనంగా నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాడిని కూడా ముంబైకి ఇచ్చే అవకాశం ఉంది.
2. రుతురాజ్ గైక్వాడ్‌ను బదులుగా ఇవ్వడం: సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు చెందిన ఆటగాడు. ముంబై పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ నాయకత్వ మార్పు కోరుకుంటే, హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకుని గైక్వాడ్‌ను ముంబైకి పంపే సాహసం సీఎస్‌కే చేయవచ్చు.
3. నగదు బదిలీ (All-Cash Trade): గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబైకి హార్దిక్ వచ్చినట్లుగానే, ఎలాంటి ఆటగాళ్లను మార్చుకోకుండా కేవలం నగదు రూపంలో (All-Cash Trade) కూడా ఈ ఒప్పందం జరగవచ్చు. దీనికోసం ముంబై తన భారీ ధర కలిగిన ఆటగాళ్లను వదిలించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలే. అటు ముంబై ఇండియన్స్ కానీ, ఇటు సీఎస్‌కే కానీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా, కాశీ విశ్వనాథన్ మధ్య జరిగిన సంభాషణ కేవలం మర్యాదపూర్వకమైనది కూడా కావచ్చు. కానీ ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చిన్న చర్చలే పెద్ద మార్పులకు దారితీశాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..