Hardik Pandya: శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్.. పాండ్య షాక్.. రెండు చేతులు జోడించి మోకాళ్లపై కూర్చొని…

| Edited By: Ram Naramaneni

Mar 29, 2021 | 9:16 PM

మ్యాచ్‌ ఏదైనా... ప్రత్యర్థి ఎవ్వరైనా.. సీరియస్‌ మ్యాచ్‌లో ఫన్‌ తెప్పించడం అతడి నైజం. ఇక మ్యాచ్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంలోనూ మానోడికి తిరుగులేదు.

Hardik Pandya:  శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్.. పాండ్య షాక్.. రెండు చేతులు జోడించి మోకాళ్లపై కూర్చొని...
Hardik Pandya
Follow us on

మ్యాచ్‌ ఏదైనా… ప్రత్యర్థి ఎవ్వరైనా.. సీరియస్‌ మ్యాచ్‌లో ఫన్‌ తెప్పించడం అతడి నైజం. ఇక మ్యాచ్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంలోనూ మానోడికి తిరుగులేదు. పూనకం వచ్చినోడిలా.. వచ్చిన బంతిని వచ్చిన బౌండరీలు దాటిస్తూ.. పిక్చర్‌ అబీ బాకీ హై మేరా దోస్త్‌ అంటూ సవాల్‌ విసురుతుంటాడు. అతడెవరో కాదు.. మన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. ఇక తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో హార్దిక్‌ చేసిన ఓ ఫన్నీ సీన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

కోహ్లి సేన 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, టీమిండియా కీలక సమయాల్లో పలు క్యాచ్‌లు డ్రాప్‌ చేసింది. ఇక పదకొండో ఓవర్‌లో నటరాజన్‌ వేసిన బంతిని షాట్‌ ఆడిన స్టోక్స్‌, గాల్లోకి లేపగా మిడ్‌ వికెట్లో ఉన్న ధావన్‌ ఏమాత్రం తడబడకుండా స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఫిదా చేశాడు. ఇక, స్టోక్స్‌ క్యాచ్‌ పట్టినందుకు గబ్బర్‌కు రెండు చేతులు జోడించి దండం పెడుతూ, మోకాళ్ల మీద కూర్చుని థ్యాంక్స్‌ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.భారత జట్టు మరోసారి సత్తాచాటింది. సొంతగడ్డపై కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కూడా వశం చేసుకొని రికార్డు సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి మ్యాచ్‌లో కోహ్లీ సేన అదరగొట్టి ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

`త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్‌` సినిమాకు క్లాప్ కొట్టిన హరీష్ రావు.. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉందన్న మంత్రి..